డీలిమిటేషన్‌తో ఏటా రూ.374 కోట్లు ఖర్చు : సీజేపీ మండిపాటు! | CJPs Dipke Targets Centre Over Delimitation bill | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌తో ఏటా రూ.374 కోట్లు ఖర్చు : సీజేపీ మండిపాటు!

Nov 29 2026 1:14 PM | Updated on Nov 29 2026 1:17 PM

CJPs Dipke Targets Centre Over Delimitation bill

న్యూఢిల్లీ: డీలిమిటేషన్ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శలు చేశారు. లోక్‌సభ సభ్యుల సంఖ్యతో పాటు కేంద్ర మంత్రుల సంఖ్యను పెంచడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. పన్ను చెల్లింపుదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌ (ఎ‍క్స్‌) వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం 68 మంది మంత్రులతో కూడిన కేంద్ర మంత్రివర్గంపై ప్రభుత్వం ఏటా రూ.620 కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అంటే ఒక్కో మంత్రిపై సగటున ఏడాదికి రూ.9.1 కోట్ల ప్రజాధనం వ్యయమవుతోందని వివరించారు.

డీలిమిటేషన్ అనంతరం కేంద్ర మంత్రుల గరిష్ఠ సంఖ్య 81 నుంచి 122కు పెరిగే అవకాశం ఉందని దీప్కే తెలిపారు. దీనివల్ల అదనంగా 41 మంది మంత్రులు పెరిగితే.. ఏటా మరో రూ.374 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. లోక్‌సభ, కేంద్ర మంత్రివర్గం విస్తరణ వల్ల ప్రజలకు ప్రయోజనం కలగకపోగా, పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బుతో రాజకీయ నాయకుల సంఖ్య మాత్రమే పెరుగుతుందని విమర్శించారు.

కాగా, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల స్థానాల సంఖ్య పెంచే అంశంపై కేంద్రం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు-2026ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ బిల్లు ద్వారా లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాల నుంచి 815, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర అసెంబ్లీల గరిష్ఠ సభ్యుల సంఖ్యను 500 నుంచి 650కి పెంచాలని ప్రతిపాదించింది.

అయితే ఈ బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వల్ల షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టీ) ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా బీజేపీ తన బలాన్ని పెంచుకునేందుకే ఈ ప్రక్రియను చేపడుతోందని కూడా వారు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: నేపాల్ నుంచి అయోధ్యకు రైలు.. అంతటా జై శ్రీరామ్‌ నినాదాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement