నైటీ వేసుకుని అర్ధరాత్రి రోడ్డుపై రచ్చరచ్చ | Midnight Man In Nightie Creates Commotion | Sakshi
Sakshi News home page

నైటీ వేసుకుని అర్ధరాత్రి రోడ్డుపై రచ్చరచ్చ

Nov 29 2026 1:13 PM | Updated on Nov 29 2026 1:19 PM

Midnight Man In Nightie Creates Commotion

కర్ణాటక: హాసన పట్టణంలో అర్ధరాత్రి వేళ ఓ అపరిచిత వ్యక్తి  నైటీ ధరించి హల్‌చల్‌ చేశాడు. పట్టణంలోని హేమావతి బడావణె, శాంతి నగర్‌ ప్రాంతాల్లో ఈ ఆగంతకుడు తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నెల 22వ తేదీ (ఆదివారం) రాత్రి 1:36 గంటల సమయంలో రామస్వామి అయ్యంగార్‌ రోడ్డులో నైటీ ధరించి, ముఖానికి ముసుగు (వేల్‌) వేసుకున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగాడు. స్థానికుడు పునీత్‌ తన దుకాణానికి అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొదట మహిళ వేషంలో వెళ్లిన ఆ వ్యక్తి.. తిరిగి వచ్చే సమయంలో వీధి కుక్కలు మొరగడంతో నైటీని విప్పేసి, పురుషుడి రూపంలో పరుగెత్తడం కనిపించింది.   

భయాందోళనలో ప్రజలు 
గత రెండు వారాలుగా హాసన పట్టణంలో వరుసగా ఇళ్లల్లో చోరీలు జరుగుతుండటంతో ఈ ఘటన పలు అనుమానాలకు దారితీస్తోంది. పట్టణంలో ’చడ్డీ గ్యాంగ్‌’, ’అర్ధనగ్న గ్యాంగ్‌’ సంచరిస్తున్నాయంటూ ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ (పెట్రోలింగ్‌) పెంచాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement