అట్టహాసంగా పాఠశాల వార్షిక క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా పాఠశాల వార్షిక క్రీడా పోటీలు

Nov 29 2026 1:04 PM | Updated on Nov 29 2026 1:04 PM

బళ్లారి రూరల్‌ : సెయింట్‌ ఫిలోమినా పాఠశాల వార్షిక క్రీడా పోటీలు బీఎంసీఆర్‌సీ క్రీడా మైదానంలో శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వార్షిక క్రీడా పోటీలను ప్రభుత్వ బళ్లారి దంత వైద్య కళాశాల పరిశోధన కేంద్రం ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ తనూజరాణి క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా డీడీపీయూ హనుమంతరావు, జిల్లా డీడీపీఐ మహమ్మద్‌ రఫిక్‌, అతిథులుగా బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త అర్చనాదాస్‌ అనిల్‌ విచ్చేశారు. ఒక్క రోజు పాటు జరిగే ఈ క్రీడల్లో భాగంగా విద్యార్థులకు 100, 400 మీటర్ల పరుగు పందేలు, 100 మీటర్ల రిలే, ఆక్టోపస్‌ రేస్‌, డ్రిల్‌ రింగ్స్‌ ఆఫ్‌ రైతుమ్‌ తదితర పాటీలను నిర్వహించారు. పోటీల ప్రారంభ కార్యక్రమంలో సెయింట్‌ ఫిలోమినా ప్రిన్స్‌పాల్‌ మేరీ మార్గరెట్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్న బాలికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement