దర్గాకు వెళ్లి వస్తూ యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

దర్గాకు వెళ్లి వస్తూ యువకుడు మృతి

Nov 29 2026 1:04 PM | Updated on Nov 29 2026 1:04 PM

వజ్రకరూరు: బళ్లారి నగరానికి చెందిన మహబూబ్‌ బాషా (26) అనే యువకుడు ప్రమాదంలో మరణించాడు. వివరాలు.. మహబూబ్‌బాషా, షాషావలి కలిసి బైక్‌లో శుక్రవారం బళ్లారి నుంచి పెనుకొండ దర్గాకు వచ్చి దర్శనం చేసుకుని గుంతకల్లుకు వచ్చారు. అక్కడి నుంచి బళ్లారికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వజ్రకరూరు మండలం కొనకొండ్ల శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందకు పడిపోయారు. మహబూబ్‌బాషాకు తీవ్రగాయాలై అక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. షాషావలికి గాయాలు అయ్యాయి. మృతుని తల్లి పర్విన్‌బాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతునికి నాలుగునెలల క్రితమే వివాహమైనట్లు ఫిర్యాదులో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement