రాయచూరు రూరల్: పోలీసులు విధులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీజీ జకాతి పిలుపునిచ్చారు. శనివారం ఎస్పీ క్రీడా మైదానంలో రెండు రోజుల వార్షిక పోలీస్ క్రీడా పోటీలు–2026ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ క్రీడలతో మానసిక, శారీరక దేహదారుఢ్యాన్ని సాధించవచ్చన్నారు. క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి, ఏఎస్పీ హరీష్, డీఎస్పీలు శాంత కుమార్, చంద్రశేఖర్, సులేమాన్, సీఐలు ఉమేష్, సాబయ్య, ఎస్ఐలు బసవరాజ్, ప్రకాష్ డంబళ్, మంజునాథ్లున్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిలుపు


