ఎద్దు వెంట్రుకలతో కనుబొమ్మలు | Beauty tips: Eyebrows made of ox hair | Sakshi
Sakshi News home page

ఎద్దు వెంట్రుకలతో కనుబొమ్మలు

Nov 29 2026 11:14 AM | Updated on Nov 29 2026 11:14 AM

Beauty tips: Eyebrows made of ox hair

పురాతన గ్రీకు మహిళలు అందం కోసం రకరకాల ప్రయోగాలు చేసేవారు. తెల్లని చర్మాన్ని వారు అందానికి గుర్తుగా భావించేవారు. అందుకని బుగ్గలు, పెదవులకు ఎర్రని రంగు కోసం మల్బరీ పండ్లను నలిపి తీసిన రసాన్ని పూసుకునేవారు. ఎర్రమట్టి, ఎర్రటి ఇనుప రజనుతోనూ పెదవులకు రంగు వేసుకునేవారు. 

కళ్లు నల్లగా, ఆకర్షణీయంగా కనిపించేలా ఉండేందుకు బొగ్గు పొడిని నూనెలో కలిపి కాటుకలా ఉపయోగించేవారు. ఇక కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా కనిపించేందుకు ఎద్దు వెంట్రుకలతో నకిలీ కనుబొమ్మలను తయారు చేసుకునేవారు. రెండు కనుబొమ్మలూ కలిసిపోయినట్లుగా ఉండే రూపాన్నే మరింత అందంగా భావించేవారు. అందుకే కనుబొమ్మల మధ్య ఖాళీ లేకుండా చూసుకునేవారు.

ఇంట్లోనే సంరక్షణ!
చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఖరీదైన సౌందర్య సాధనాలే అవసరం లేదు. ఇంట్లో దొరికే సహజ పదార్థాలతోనూ చర్మానికి సంరక్షణ అందించవచ్చు. స్నానానికి ముందు కొబ్బరి నూనెతో చేతులు, కాళ్లపై మృదువుగా మర్దన చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ముఖానికి పలుచగా తేనె రాసి పది నిమిషాల తర్వాత కడిగితే చర్మానికి తేమ అంది మృదువుగా మారుతుంది. ముఖానికి పెరుగు రాసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. 

రాత్రి పడుకునే ముందు నెయ్యి రాసుకుంటే పెదవులు పగలకుండా ఉంటాయి. పాదాలకు కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్‌ రాసి సాక్స్‌ ధరించాలి. ఓట్స్‌ పొడిని నీటితో కలిపి మెత్తని మిశ్రమంలా చేసి చేతులు, కాళ్లను సున్నితంగా శుభ్రం చేసుకోవచ్చు. కలబంద గుజ్జు కూడా చర్మానికి తేమను అందిస్తుంది. వీటితో పాటు రోజూ తగినంత నీరు తాగుతూ, పండ్లు, కూరగాయలు, గింజలను ఆహారంలో చేర్చుకోవాలి.

యూ లైక్‌ రీగ్లో 
ఈ పరికరం నుంచి వెలువడే కాంతి ముఖానికి సోకితే, ముఖం కాంతిమంతంగా మారుతుంది. ముఖవర్చస్సును మెరుగుపరచుకోవడానికి అతి సులువైన పరిష్కారంగా రూపొందించినదే ఈ యూ లైక్‌ రీగ్లో ఎల్‌ఈడీ లైట్‌ థెరపీ మాస్క్‌. సాధారణ ఎల్‌ఈడీ మాస్క్‌లలో ఉండే లైట్ల కంటే ఇందులో రెండింతలు ఎక్కువగా 272 అధునాతన ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. 

ఇవి చర్మానికి మెరుగైన కాంతి చికిత్సను అందిస్తాయి. అంతేకాకుండా ఇందులోని మరో ప్రత్యేకత 360 డిగ్రీల మిర్రర్‌ రిఫ్లెక్షన్‌ టెక్నాలజీ. దీనివల్ల కాంతి ముఖమంతటికీ సమానంగా అందుతుంది. దీనిద్వారా ముఖంపై మొటిమలు తగ్గి, ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement