సన్ స్క్రీన్ కొనేటప్పుడు ఎస్‌పీఎఫ్ 30 తీసుకోవాలా? 50 ఎంచుకోవాలా? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. ఎస్‌పీఎఫ్ 30 సూర్యుడి నుంచి వచ్చే యూవీబీ కిరణాల్లో సుమారు 97 శాతం వరకు అడ్డుకుంటుంది. ఎస్‌పీఎఫ్ 50 దాదాపు 98 శాతం కిరణాలను అడ్డుకుంటుంది. ఈ రెండింటి మధ్య తేడా తక్కువే అయినా, ఎక్కువసేపు ఎండలో ఉండేవారికి ఎస్‌పీఎఫ్ 50 ఉపయోగకరంగా ఉంటుంది.
రోజువారీ అవసరాలకు ఎస్‌పీఎఫ్ 30 సరిపోతుంది. అయితే సంఖ్యతో పాటు బ్రాడ్ స్పెక్ట్రమ్ రక్షణ ఉన్నసన్ స్క్రీన్‌ను ఎంచుకోవాలి. ఇది యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. బయటకు వెళ్లే 15 నిమిషాల ముందు రాసుకోవాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి, చెమట పట్టినప్పుడు లేదా ఈత కొట్టిన తర్వాత మళ్లీ రాసుకోవాలి. సన్ స్క్రీన్‌ను వాడటం ఎంత ముఖయమో.. చర్మతత్వానికి సరి΄ోయే సన్ స్క్రీన్‌ను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం.
ఇదీ చదవండి: డా.శివరంజని మరో ఘనత : రూ.9 కోట్ల మందు అత్యంత చౌకగా


