మణికట్టుపై వాచీ ఎప్పటి నుంచి? ఇంట్రస్టింగ్‌ స్టోరీ | In 1810 The wristwatch began do you know the real story | Sakshi
Sakshi News home page

మణికట్టుపై వాచీ ఎప్పటి నుంచి? ఇంట్రస్టింగ్‌ స్టోరీ

Nov 21 2026 1:35 PM | Updated on Nov 21 2026 1:35 PM

In 1810 The wristwatch began do you know the real story

పిల్లలూ... నూట యాభై ఏళ్ల క్రితం వరకు మణికట్టు వాచీలు ఉండేవి కావు. జేబులో పెట్టుకునే  పాకెట్‌ వాచీలు’ మాత్రమే వాడేవారు. చరిత్ర ప్రకారం 1810వ సంవత్సరంలో ప్రఖ్యాత వాచీల తయారీదారు అబ్రహం–లూయిస్‌ బ్రెగెట్, నేపుల్స్‌ రాణి కరోలిన్‌ మురాట్‌ కోసం మొట్టమొదటిసారిగా చేతికి కట్టుకునే వాచీని తయారు చేశారు. అప్పట్లో మణికట్టు వాచీలను కేవలం ఆడవాళ్లు బ్రాస్‌లెట్‌లా మాత్రమే ధరించేవారు! 

మగవాళ్లు చేతికి వాచీ పెట్టుకోవడాన్ని వింతగా చూసేవారు. అయితే 1904లో బ్రెజిల్‌కు చెందిన విమాన పైలట్‌ ఆల్బర్టో విమానం నడుపుతున్నప్పుడు జేబులోంచి వాచీ తీసి సమయం చూడటం కష్టంగా ఉందని తన స్నేహితుడు లూయిస్‌ కార్టియర్‌కు చెప్పారు. దాంతో కార్టియర్‌ తోలు బెల్టుతో మణికట్టుకు కట్టుకునే వాచీని తయారు చేసి ఇచ్చారు. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులు యుద్ధభూమిలో జేబులోంచి వాచీ తీయడం కుదరక, మణికట్టు వాచీలు కట్టుకోవడం మొదలుపెట్టారు. యుద్ధం ముగిశాక అది ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌ గా, అవసరంగా మారిపోయింది!

 ఇదీ చదవండి: డెబ్యూతోనే ప్రశంసలు : ఒరాకిల్‌ నుంచి ‘తార’ గా ఎవరీ భామ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement