ట్రావెల్ ట్రెండ్
వైవిధ్యానికి మారుపేరు భారత్. ప్రతి ప్రాంతానికీ ఓ ప్రత్యేకత.. అడుగడుగునా ఓ అద్భుతం. మంచుతో కప్పుకున్న హిమశిఖరాల నుంచి అలలతో పలకరించే సముద్ర తీరాల వరకు.. పచ్చని అడవుల నుంచి.. ప్రకృతి అందాల వరకు, మనసుదోచే చారిత్రక కట్టడాల నుంచి.. సంస్కృతి సంప్రదాయాల వరకు మన దేశంలో కలగలిసి కనిపిస్తాయి.
ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న భారత్‌ను.. 2027 సంవత్సరానికి ‘డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది అంతర్జాతీయ పర్యాటక పత్రిక ‘ట్రావెల్ అండ్ లీజర్’. పర్యటన అంటే కేవలం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్‌లతో కూడిన గోల్డెన్ ట్రయాంగిల్ మాత్రమే కాదని .. మరో ఎనిమిది ప్రాంతాలు కూడా విదేశీయులను విశేషంగా ఆకట్టుకున్నట్టు ఇందులో తెలిపింది. ఈ గుర్తింపుతో భారత పర్యాటక రంగం ప్రపంచస్థాయిలో మరో మైలురాయిని చేరుకుంది. ఆ ఎనిమిది ప్రాంతాల విశేషాలు ..
ప్రకృతి ఒడి లక్షద్వీప్..
అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ దీవులు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. నీలిరంగు సముద్రం, తెల్లటి ఇసుక తీరాలు, పగడపు దిబ్బలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి. సముద్రంలో ఈత, స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి సాహస క్రీడలకు ఇవి అనువైన ప్రాంతాలు. అయితే ఇక్కడి దీవులను సందర్శించాలంటే మాత్రం ముందుగానే పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరి.
పులుల ప్రపంచం మధ్యప్రదేశ్..
వన్య్రపాణుల ప్రేమికులకు మధ్యప్రదేశ్ మంచి పర్యాటక ప్రాంతం. పన్నా జాతీయ పార్కుతో పాటు పలు అభయారణ్యాలు ఇక్కడ ఉన్నాయి. పులులు, ఇతర వన్య్రపాణులను దగ్గరగా చూసే సఫారీ అనుభవం ఇక్కడి మరో ప్రత్యేకత. ప్రకృతి అందాల మధ్య సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు మరపురాని అనుభూతినిస్తుంది.
వర్షాల ప్రపంచం మావ్సిన్ రామ్
మేఘాలయలోని మావ్సిన్ రామ్ ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. పచ్చని కొండలు, జలపాతాలు, ఇసుకరాతి గుహలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. వర్షాకాలంలో ప్రకృతి అందాలు మరింత కనువిందు చేస్తాయి.
సరస్సుల నగరం.. ఉదయ్‌పూర్
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ సరస్సులు, రాజభవనాలకు ప్రసిద్ధి. పిచోలా సరస్సు, సిటీ ΄్యాలెస్, మాన్ సూన్ ΄్యాలెస్ ఇక్కడి ప్రధాన పర్యాటక కేంద్రాలు. బోటింగ్, రాజభవనాల సందర్శన పర్యాటకులకు ప్రత్యేక అనుభూతినిస్తాయి.
గిరి సంస్కృతుల నాగాలాండ్
పండుగల భూమి నాగాలాండ్‌లో జరిగే హార్న్‌బిల్ ఉత్సవం గిరిజన సంస్కృతికి అద్దం పడుతుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, కళలు, చేతివృత్తులు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వివిధ తెగల జీవన విధానాలు, ఆచార సంప్రదాయాలను దగ్గరగా తెలుసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది.
శిల్పకళకు చెట్టినాడ్..
తమిళనాడులోని చెట్టినాడ్ ప్రాంతం సంప్రదాయ భవన నిర్మాణాలకు ప్రసిద్ధి. విశాలమైన భవనాలు, అందమైన ప్రాంగణాలు, కర్రతో చేసిన కళాకృతులు, ప్రత్యేకమైన ఆహార సంప్రదాయాలు ఇక్కడి ప్రత్యేకత. చరిత్ర, నిర్మాణ కళలపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి పర్యాటక ప్రాంతం.
మినీ వరల్డ్ ముంబై..
ముంబై అంటే కేవలం సినిమా ప్రపంచం, పెద్దపెద్ద భవంతులు మాత్రమే కాదు. విభిన్న సంస్కృతి సంప్రదాయాలు, ప్రత్యేకమైన ఆహార రుచులు, కళాత్మక ప్రాంతాలు ఈ నగరం ప్రత్యేకత. స్థానిక మార్కెట్లు, సముద్ర తీరాలు పర్యాటకులకు ఎన్నో అనుభవాలను అందిస్తాయి.
మన మినీ స్విస్ ఖజ్జియార్..
అందమైన పర్వత ప్రాంతం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖజ్జియార్. పచ్చని పచ్చిక మైదానాలు, సరస్సు, పైన్ చెట్లు, మంచుతో కప్పుకున్న పర్వతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
ప్రకృతి ఒడి లక్షద్వీప్..
అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ దీవులు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. నీలిరంగు సముద్రం, తెల్లటి ఇసుక తీరాలు, పగడపు దిబ్బలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి. సముద్రంలో ఈత, స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి సాహస క్రీడలకు ఇవి అనువైన ప్రాంతాలు. అయితే ఇక్కడి దీవులను సందర్శించాలంటే మాత్రం ముందుగానే పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరి.
పులుల ప్రపంచం మధ్యప్రదేశ్..
వన్య్రపాణుల ప్రేమికులకు మధ్యప్రదేశ్ మంచి పర్యాటక ప్రాంతం. పన్నా జాతీయ పార్కుతో పాటు పలు అభయారణ్యాలు ఇక్కడ ఉన్నాయి. పులులు, ఇతర వన్య్రపాణులను దగ్గరగా చూసే సఫారీ అనుభవం ఇక్కడి మరో ప్రత్యేకత. ప్రకృతి అందాల మధ్య సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు మరపురాని అనుభూతినిస్తుంది.
వర్షాల ప్రపంచం మావ్సిన్ రామ్
మేఘాలయలోని మావ్సిన్ రామ్ ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. పచ్చని కొండలు, జలపాతాలు, ఇసుకరాతి గుహలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. వర్షాకాలంలో ప్రకృతి అందాలు మరింత కనువిందు చేస్తాయి.
సరస్సుల నగరం.. ఉదయ్‌పూర్
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ సరస్సులు, రాజభవనాలకు ప్రసిద్ధి. పిచోలా సరస్సు, సిటీ ΄్యాలెస్, మాన్ సూన్ ΄్యాలెస్ ఇక్కడి ప్రధాన పర్యాటక కేంద్రాలు. బోటింగ్, రాజభవనాల సందర్శన పర్యాటకులకు ప్రత్యేక అనుభూతినిస్తాయి.
గిరి సంస్కృతుల నాగాలాండ్
పండుగల భూమి నాగాలాండ్‌లో జరిగే హార్న్‌బిల్ ఉత్సవం గిరిజన సంస్కృతికి అద్దం పడుతుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, కళలు, చేతివృత్తులు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వివిధ తెగల జీవన విధానాలు, ఆచార సంప్రదాయాలను దగ్గరగా తెలుసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది.
ఇదీ చదవండి: ఫోన్ చేతిలో ఉంటే చాలు.. మెదడుకు ముప్పేనా?


