డా.శివరంజని మరో ఘనత : రూ.9 కోట్ల మందు అత్యంత చౌకగా | Hyderabad doctor Sivaranjani Santosh cuts cost of rs 9 crore drug to 2-5 lakh | Sakshi
Sakshi News home page

డా.శివరంజని మరో ఘనత : రూ.9 కోట్ల మందు అత్యంత చౌకగా

Nov 21 2026 4:12 PM | Updated on Nov 21 2026 4:20 PM

Hyderabad doctor Sivaranjani Santosh cuts cost of rs 9 crore drug to 2-5 lakh

Hyderabad doctor Sivaranjani Santosh నకిలీ ఓఆర్‌ఎస్ (ORS) పానీయాల విక్రయాలకు వ్యతిరేకంగా  అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించిన  హైదరాబాద్‌కు చెందిన శిశువైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ మరో సారి వార్తల్లో నిలిచారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు చికిత్స అందక ఇబ్బంది పడటాన్ని చూసి తట్టుకోలేని డా. శివరంజని చేసిన ప్రయత్నం కారణంగా కోట్ల రూపాయల విలువ చేసే మందు ఇపుడు  అత్యంత చౌకగా అందుబాటులోకి  రానుంది.  దీంతో పలువురు వైద్య నిపుణులు, సామాజిక వేత్తలతోపాటు, గాయని చిన్మయి శ్రీపాద తదితరలు డా. శివరంజనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 


అరుదైనజన్యువ్యాధి..అలన్-హెర్న్‌డన్-డెడ్లీ సిండ్రోమ్ (AHDS) దీనికి చికిత్స చేయాలంటే  కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. ఇది థైరాయిడ్ హార్మోన్ మెదడుకు చేరకుండా అడ్డుకునే ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఇది చిన్నారి ఎదుగుదల, కదలికలు, కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులకు ‘టిరాట్రికోల్‌’ అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు.  ఏడాది చికిత్స కోసం దీని ఖరీదు  సుమారు రూ.4.68 కోట్ల నుంచి రూ.9 కోట్లు. డాక్టర్ శివరంజని తన ప్రచారాన్ని ప్రారంభించే నాటికి, భారతదేశంలో ఈ వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు పిల్లలను గుర్తించారు. సామాన్య ప్రజలకు ఇంత ఖర్చుచేయడం అంటే దాదాపు అసాధ్యం.  ముఖ్యంగా తన వద్ద చికిత్స పొందుతున్న 'ఆరవ్' అనే చిన్నారికి పరిస్థితికి స్వయంగా డా. శివరంజని  గమనించారు. జర్మనీ నుండి దిగుమతి చేసుకునే ఒక్క నెల మందుల కోసమే ఆరవ్ తల్లి పవిత్ర సిరోల్కర్ రూ. 12 నుండి 13 లక్షల వరకు సమకూర్చుకోవాల్సి వచ్చేది. ఇదే ఆమెలో ఆవేదనను, ఆలోచనను రగిలించింది.  అంతే ఆమె తనదైన ప్రచారాన్ని, ఉద్యమాన్ని మొదలు పెట్టారు.

ఈ ప్రచారం ఎలా మొదలైంది?
మందులను తక్కువ ధరకే పొందే మార్గం కోసం డాక్టర్ శివరంజని మొదట ఫార్మాస్యూటికల్ కంపెనీలను సంప్రదించారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో, సెప్టెంబర్ 7న ఆమె ఆరవ్ పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ప్రభుత్వ ప్రతినిధులను ట్యాగ్ చేస్తూ సహాయం కోరారు.

ఆమె చేసిన విజ్ఞప్తిలో ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) రాసిన లేఖ కూడా ఉంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుండి దిగుమతి అనుమతి ఇప్పటికే లభించినప్పటికీ, విదేశీ తయారీదారు నుండి నేరుగా మందులను కొనుగోలు చేసి రవాణా చేయడంలో అడ్డంకులు ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్‌లో జరిగిన క్లినికల్ ట్రయల్ ద్వారా ఈ మందు అందుబాటులో ఉండేది, కానీ ఆ ట్రయల్ ముగిసిపోయింది. 

రూ.9 కోట్ల ఖరీదైన మందు పేదలకు రూ.2.5 లక్షలకే..ఎలా? ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ధర మారలేదు, మరియు యూరప్ నుండి బ్యాచ్‌లను దిగుమతి చేసుకోవడం శాశ్వత పరిష్కారం కాదని డాక్టర్ శివరంజని అంటున్నారు. కుటుంబాలు ₹9 కోట్ల ధరల భారం మోయకుండా ఉండేందుకు, అరుదైన వ్యాధుల జాతీయ విధానం కింద స్థానిక కాంపౌండింగ్‌ను అనుమతించాలని ఆమె ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కంపెనీ ధర తగ్గించే వరకు వేచి ఉండలేదామె. నెదర్లాండ్స్‌లో ఒక చట్టబద్ధమైన మార్గాన్ని ఉపయోగించారు. అలాగే ఆమె సెప్టెంబర్‌లో సోషల్ మీడియాలో ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఇది చివరికి జర్నలిస్ట్ తౌఫిక్ దృష్టికి వెళ్ళింది. ఆయన దీనిని 'యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియా' (Access to Medicines India), నెదర్లాండ్స్‌కు చెందిన 'ఫార్మాస్యూటికల్ అకౌంటబిలిటీ ఫౌండేషన్' (Pharmaceutical Accountability Foundation) దృష్టికి తీసుకెళ్లడంలో సహాయపడ్డారు. ఇది హేగ్‌లోని ట్రాన్స్‌వాల్ ఫార్మసీతో జతకట్టి, ముడి క్రియాశీల పదార్ధాన్ని ఉపయోగించి అదే మందును చట్టబద్ధంగా ప్రత్యేకంగా తయారు చేసింది.   ఫలితంగా ఏడాదికి రూ. 9 కోట్లుగా ఉన్న ఈ మందు ధర ఒక్కో చిన్నారికి సుమారు రూ. 2.5 లక్షలకు  తగ్గిపోవడం విశేషం.

ఇదీ చదవండి :బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్‌ ఆఫర్‌

ఈ ప్రయత్నం కేవలం ఆరవ్‌కే పరిమితం కాలేదు. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (CMC) లో ఇదే వ్యాధితో బాధపడుతున్న మరో ఐదుగురు చిన్నారులను గుర్తించారు. డాక్టర్ శివరంజని సోషల్ మీడియా పోస్ట్ చూసిన మరో తండ్రి కూడా ముందుకు రావడంతో, మొత్తం బాధితుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు ఉచితంగా చికిత్స అందించనున్నారు, దీనికి మొత్తం సుమారు రూ. 15.08 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో డాక్టర్ శివరంజని భారతదేశంలో రూ. 6.09 లక్షలు సమీకరించగా, మిగిలిన రూ. 9.13 లక్షలను నెదర్లాండ్స్‌లోని ఫార్మాస్యూటికల్ అకౌంటబిలిటీ ఫౌండేషన్ సేకరిస్తోంది. ఈనెల 30న హైదరాబాద్‌లోని డాక్టర్‌ శివరంజని క్లినిక్‌లో ఇద్దరు చిన్నారులకు, బెంగళూరులో మరో ఐదుగురికి తొలి విడతగా ఈ ఖరీదైన ఔషధాన్ని అందజేయనున్నారు. 

ఇది  కేవలం ఒక్కసారితో ముగిసిపోయే పరిష్కారంగా కాకుండా, శాశ్వతంగా ఉండాలని డా.శివరంజని, 'యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియా' ఆశిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ మందు వాణిజ్య ధర మారలేదు. యూరప్ నుండి బ్యాచ్‌లను దిగుమతి చేసుకోవడం శాశ్వత పరిష్కారం కాదని శివరంజని అంటున్నారు. బాధిత కుటుంబాలకు ధరల భారం లేకుండా అరుదైన వ్యాధుల జాతీయ విధానం కింద స్థానిక కాంపౌండింగ్‌ను అనుమతించాలని ఆమె ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి: 70 ఏళ్ల సమస్యకు నీనా గుప్తా సమాధానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement