సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు చర్లపల్లి–బరౌని (07561/07562) స్పెషల్ ట్రైన్ ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి 24 తేదీ తెల్లవారు జామున 1.30 గంటలకు బరౌని చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 25వ తేదీ తెల్లవారు జామున 3 గంటలకు బయలుదేరి రెండవ రోజు సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది. రెక్సాల్-చర్లపల్లి (05531/95532) స్పెషల్ ట్రైన్ ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి రెండవ రోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది.
తిరుగు ప్రయాణంలో 23వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరి రెండవ రోజు సాయంత్రం 7 గంటలకు రెక్సాల్ చేరుకుంటుంది. రెక్సాల్–చర్లపల్లి (05529/05530) అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4.55 గంటలకు రెక్సాల్ నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 24వ తేదీ రాత్రి 10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి రెండవ రోజు సాయంత్రం 7 గంటలకు రెక్సాల్ చేరుకోనుంది.
ఇదీ చదవండి: మేనరిక వివాహాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు


