హైదరాబాద్ : మిస్ తెలంగాణ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది నగరానికి చెందిన మోనియా. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన మోనియా మోడలింగ్‌పై మక్కువతో మాదాపూర్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొని సెకండ్ రన్నరప్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఫ్యాషన్ ప్రపంచంలో తాను తొలిసారిగా పాల్గొన్న పోటీల్లోనే సెకండర్ రన్నరప్‌గా నిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మోనియా తెలిపారు.



