ఉత్తుత్తిగా ‘ఉన్నత’ విద్య! | AICTE College Transparency Guidelines | Sakshi
Sakshi News home page

ఉత్తుత్తిగా ‘ఉన్నత’ విద్య!

Nov 21 2026 5:38 AM | Updated on Nov 21 2026 5:38 AM

AICTE College Transparency Guidelines

పారదర్శకత కరవు...వర్సిటీలు, కాలేజీల పనితీరుపై సమగ్ర సమాచార లోపం

ఫ్యాకల్టీ వివరాలు, ఆర్థిక లెక్కల్లో తేడాలు.. గుర్తింపు అనుమతుల్లో లోపించిన స్పష్టత

చేరికలు, డ్రాపౌట్లు, అవకాశాల గణాంకాలు నిల్‌.. నిర్వహణ తీరుపై ఏఐసీటీఈ అసంతృప్తి 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య పెరుగుతున్నా.. వాటి పనితీరు, ఆర్థిక వ్యవహారాలు, విద్యా ప్రమాణాలు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండట్లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్వహణ సంస్థలు దీనిపై దృష్టి పెట్టాలని సూచించింది.

అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించాలని ఆదేశించింది. డిజిటల్‌ వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమని హెచ్చరించింది. యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు వివరాలను ప్రజలకు వెల్లడించడంలో పారదర్శకత పాటించట్లేదనే ఆందోళన వ్యక్తం చేసింది.

అధ్యాపకుల వివరాలు అప్‌డేట్‌ లేక..: ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల అర్హ తలు, అనుభవం, బోధనా బాధ్యతలు, పరిశో« దనల వివరాలు వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం లేదు. కొన్ని సంస్థల్లో ఫ్యాకల్టీ ప్రొఫైల్స్‌ పూర్తిగా అందుబాటులో లేకపోగా.. మరికొన్ని చోట్ల పాత వివరాలే కొనసాగుతున్నాయి. దీంతో ఆయా కళాశా లల్లో బోధనా ప్రమాణాలను అంచనా వేయ డం విద్యార్థులకు కష్టంగా మారుతోంది.

విశ్వవిద్యాలయాల ఆదాయ, వ్యయాలు, ప్రభుత్వ గ్రాంట్లు, ప్రైవేటు నిధులు, విద్యా ర్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు, ఇతర ఆర్థిక వివరాలు స్పష్టంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. కానీ అనేక విద్యాసంస్థల్లో ఆర్థిక సమాచారం సమగ్రంగా అందుబాటులో ఉండటం లేదు. నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారు? మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంత వెచ్చిస్తున్నారు? అనే అంశాలపై స్పష్టత కొరవడుతోంది.

గుర్తింపు, అనుమతుల వివరాలేవీ?: యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌ఏఏసీ వంటి నియంత్రణ, గుర్తింపు సంస్థలకు సంబంధించిన అనుమ తులు, గుర్తింపు స్థితి, అక్రెడిటేషన్‌ వివరాలను విద్యాసంస్థలు తమ వెబ్‌సైట్లలో స్పష్టంగా పొందుపరచాలి. అయితే కొన్ని సంస్థల్లో ఈ వివరాలు అందుబాటులో లేకపోవ డం లేదా పాత సమాచారం కొనసాగుతుండటం సమ స్యగా మారుతోంది.

కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి? ఎంతమంది ఉన్నత చదువు లకు వెళ్తున్నారు? మధ్యలో చదువు మానేస్తున్న వారి సంఖ్య ఎంత? అనే వివరాలను కూడా సంస్థలు క్రమం తప్పకుండా వెల్లడించడం లేదు. అదేవిధంగా పరిశోదనా పత్రాలు, పేటెంట్లు, పరిశ్రమలతో కుదు ర్చుకున్న ఒప్పందాలు, పరిశోధనా ప్రాజెక్టుల వివరాలపైనా సమగ్ర సమాచారం అందుబాటులో ఉండటం లేదు. దీంతో విద్యాసంస్థల వాస్తవ పనితీరును పోల్చి చూడటం కష్టమవుతోందని ఏఐసీటీఈ పేర్కొంది.

విద్యార్థులకు సమాచార హక్కు: ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకత అనేది కేవలం వెబ్‌సైట్లలో వివరాలు ఉంచడానికే పరిమితం కాకూడదు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యా పకులు, పరిశోధకులు, ప్రజలకు అవసరమైన సమాచారం సులభంగా అందుబాటులో ఉండాలి. ప్రతి విద్యాసంస్థ వార్షిక నివేదికలు, ఆర్థిక లెక్కలు, అధ్యాపకుల వివరాలు, గుర్తింపు అనుమతులు, ప్లేస్‌మెంట్‌ గణాంకాలు, డ్రాపౌట్‌ వివరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేయాలి.

విద్యాసంస్థల పనితీరు అంచనాకు బోధనా నాణ్యత, పరిశోధనల ప్రమాణాలు, విద్యార్థుల ఉపాధి అవకాశాలు, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యత వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. పారదర్శకత, జవాబుదారీతనం పెరిగినప్పుడే ఉన్నత విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతుందని విద్యారంగ విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఈ దిశగా అన్ని సంస్థలు చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లకు ఏఐసీటీఈ సూచించింది.

ఇదీ చదవండి: చుక్కా రామయ్య వ్యక్తిత్వం రాజకీయాలకు అతీతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement