‘కోటి దీపోత్సవం’లో పాల్గొనేందుకు...
25న సిద్దిపేట మహాపాదయాత్రలో కేంద్రమంత్రి జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 2న హైదరాబాద్‌లో జరిగిన మహాపాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా అమిత్ షాకు ఆ టీవీ ఎండీ నరేంద్రచౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఆహ్వనపత్రం అందజేశారు.
24న సాయంత్రం బేగంపేట విమానాశ్రయంలో దిగాక అమిత్ షా నేరుగా ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకొని ఆ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు పార్టీవర్గాల సమాచారం. అదేరోజు రాత్రి ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ నెల 25న సిద్దిపేటలో ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం– అరాచకత్వాన్ని పాతరేద్దాం’నినాదంతో రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాపాదయాత్రలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పాల్గొననున్నారు.
26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చేపడుతున్న కార్యక్రమంలో మరో కేంద్రమంత్రి పాల్గొనే అవకాశాలున్నాయని పారీ్టవర్గాల సమాచారం.
ఇదీ నితిన్‌నబీన్ టూర్ షెడ్యూల్...
ఈనెల 23న మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌లో నిర్వహించనున్న మహాపాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబీన్ పాల్గొనను న్నారు. ‘సర్’పేరిట రాజ్యాంగ సంస్థలపై ఇండీ కూటమి పేరుతో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు.
ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్‌కు నితిన్ చేరుకుంటారు. కరీంనగర్ వైశ్యాభవన్ వద్ద ‘మహాపాదయాత్ర’ప్రారంభమై టవర్ సర్కిల్, శాస్త్రీరోడ్ మీదుగా కమాన్ దాకా దాదాపు 2 కి.మీల మేర ఇది కొనసాగనుంది.


