‘మసిపూసి, మారేడుకాయ చేయడం మాకు తెలియదు..’ : కిషన్‌ రెడ్డి | Kishan Reddy Comments On Congress BRS Relangana | Sakshi
Sakshi News home page

‘మసిపూసి, మారేడుకాయ చేయడం మాకు తెలియదు..’ : కిషన్‌ రెడ్డి

Nov 21 2026 1:16 AM | Updated on Nov 21 2026 1:16 AM

Kishan Reddy Comments On Congress BRS Relangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు గుప్పిస్తూ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి రెండు పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తెలంగాణను దోపిడీ చేశాయని, ప్రజలు వారి అవినీతి పాలనను అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే తెలంగాణలో బీజేపీ 8 పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకుందని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనను నిశితంగా గమనిస్తున్నారని, ఆ రెండు పార్టీలపై విసుగు చెందారని పేర్కొన్నారు.

‘మీలాగా మాకు మసిపూసి మారేడుకాయ చేసి మాట్లాడే శక్తి లేకపోవచ్చు.. కానీ ప్రజలకు సుపరిపాలన అందించే శక్తి ఉంది’ అంటూ కాంగ్రెస్‌ నేతలపై వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణను దోపిడీ చేశాయని విమర్శించారు.

ఈ క్రమంలో బీజేపీ ఇక తన రాజకీయ ఆట మొదలుపెడుతుందని, రెండు పార్టీల సంగతి తేలుస్తామని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement