పట్టణాల అభివృద్ధిపై సీఎం రేవంత్‌ కీలక సమీక్ష.. | Telanganam Urban Development 20 Thousand Crore | Sakshi
Sakshi News home page

పట్టణాల అభివృద్ధిపై సీఎం రేవంత్‌ కీలక సమీక్ష..

Nov 20 2026 11:02 PM | Updated on Nov 20 2026 11:02 PM

Telanganam Urban Development 20 Thousand Crore

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పట్టణాల రూపురేఖలు మార్చేలా భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ఏఐఐబీ, కేఎఫ్‌డబ్ల్యూ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారంతో సుమారు రూ.20 వేల కోట్లతో పట్టణాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

వాతావరణ మార్పులను తట్టుకునేలా పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు వరద ముప్పును తగ్గించడం, కర్బన ఉద్గారాలను నియంత్రించడం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

అలాగే వరంగల్‌ కోట కందకాన్ని పునరుద్ధరించడంతోపాటు హనుమకొండలో సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (సీబీడీ) అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. పట్టణాల్లో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేలా ప్రత్యేక విధానాన్ని అమలు చేయనుంది. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, టెక్స్‌టైల్‌ పార్కులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించింది.

మరోవైపు ఘన వ్యర్థాల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్‌లో చెత్త నుంచి 10–12 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు బయో సీఎన్‌జీ ఉత్పత్తి, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్లను నెలకొల్పే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో కాలుష్య నియంత్రణతో పాటు పర్యావరణహిత అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి: ‘మా ఆట తెలంగాణలో మొదలు పెడుతున్నాం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement