తలకిందులుగా ఈదే అరుదైన జలచర కీటకం! | New insect that swims upside down found in Telugu States | Sakshi
Sakshi News home page

తలకిందులుగా ఈదే జలచర కీటకం గుర్తింపు

Nov 20 2026 7:32 PM | Updated on Nov 20 2026 7:32 PM

New insect that swims upside down found in Telugu States

ఏపీలోని శేషాచలం, తెలంగాణలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో కనుగొన్న శాస్త్రవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్తలు దేశంలోని తూర్పు కనుమల అటవీ ప్రాంతాల్లో ఒక అరుదైన, కొత్త జలచర కీటక జాతిని కనుగొన్నారు. ఏపీలోని శేషాచలం బయోస్పియర్‌ రిజర్వ్, తెలంగాణలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లోని మంచినీటి ఆవాసాల్లో ఉండే ఈ కీటకానికి ‘ఎనిథారెస్‌ డెక్కనెన్సిస్‌’ అని నామకరణం చేశారు. బ్యాక్‌స్విమ్మర్స్‌ (నోటోనెక్టిడే కుటుంబం) కుటుంబానికి చెందిన ఈ తరహా కీటకాలు నీటి ఉపరితలం కింద తలకిందులుగా ఈదుతాయి.

ఇతర జాతులతో పోలిస్తే ఎనిథారెస్‌ డెక్కనెన్సిస్‌ రెక్కలపై ముదురు రంగులో వీ ఆకారంలో గుర్తు ఉంటుంది. అలాగే మగ కీటకాల్లో కొడవలి ఆకారంలో ఉండే ప్రత్యేక పునరుత్పత్తి నిర్మాణం కనిపిస్తుంది. డీఎన్‌ఏ బార్‌కోడింగ్, శరీర నిర్మాణ విశ్లేషణల ద్వారా.. ఈ జలచర కీటకం ఇప్పటికే ఉన్న ఇతర జాతుల కంటే 10 నుంచి 14.5 శాతం జన్యుపరమైన భిన్నత్వాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్‌ ‘జర్నల్‌ ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ’లో ప్రచురితమయ్యాయి. 

ఇదీ చ‌ద‌వండి: మ‌హిళా భ‌ద్ర‌త‌కు తెలంగాణ‌ హైకోర్టు మార్గదర్శకాలు

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement