తగ్గేదేలే..! | Rajagopal Reddy Comments on CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే..!

Nov 21 2026 5:30 AM | Updated on Nov 21 2026 5:30 AM

Rajagopal Reddy Comments on CM Revanth Reddy

సీఎం రేవంత్‌పై ఆగని రాజగోపాల్‌రెడ్డి మాటల యుద్ధం

సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలు సైతం బేఖాతరు 

దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ క్షమించదంటూ ‘ఎక్స్‌’లో పోస్టు 

ముఖ్యనేతలకు సద్బుద్ధి, ఆత్మపరిశీలన జ్ఞానం ప్రసాదించాలంటూ అయ్యప్ప స్వామికి వేడుకోలు 

మునుగోడు ఎమ్మెల్యేకు షోకాజ్‌ నోటీసు ఇచ్చే యోచనలో పీసీసీ

సాక్షి, హైదరాబాద్‌:     మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. సిద్దిపేట సభలో సొంత పార్టీ అసంతృప్తి నేతల గురించి సీఎం రేవంత్‌ చేసిన హెచ్చరికలను కూడా ఆయన పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. శుక్రవారం మరోమారు పరోక్షంగా రేవంత్‌పై మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

‘ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని గ్రహించాలి. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే, ప్రజావసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదని మరువరాదు.

ఇచ్చిన హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ణానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను. స్వామియే శరణం అయ్యప్ప...’అంటూ రాజగోపాల్‌రెడ్డి పోస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.  

రేపు పీఏసీ భేటీలో చర్చ! 
పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగ వేదికలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజాగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇస్తారనే చర్చ గాం«దీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. పారీ్టలో అంతర్గత క్రమశిక్షణ విషయంలో ఇప్పటికే పలుమార్లు అధిష్టానం నుంచి వచ్చిన సూచనలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలు సీఎం రేవంత్‌ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని పీసీసీ క్రమశిక్షణా కమిటీ భావిస్తోందని, త్వరలోనే భేటీ అయి ఈ మేరకు నోటీసు ఇస్తుందని తెలుస్తోంది. అయితే ఆదివారం జరగనున్న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం పీఏసీ అనుమతి మేరకు రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇస్తారని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి.

గట్టి సంకేతాలు పంపాలంటున్న రేవంత్‌! 
తాము కూడా తగ్గేది లేదని, అవసరమైతే రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు సీఎం రేవంత్‌ కూడా రాజగోపాల్‌రెడ్డి విషయంలో గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. పదేపదే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారికి గట్టి సంకేతాలు పంపేలా చర్యలు ఉండాలని ఆయన అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement