వివాహేతర సంబంధం.. ఇద్దరిని కట్టేసి కొట్టిన భర్త! | Extramarital Affair In Mancherial | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. ఇద్దరిని కట్టేసి కొట్టిన భర్త!

Nov 21 2026 2:18 PM | Updated on Nov 21 2026 2:19 PM

Extramarital Affair In Mancherial

వరంగల్ జిల్లా: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరిపై దాడి చేసిన సంఘటన నర్సంపేటలోని సంజయ్‌గాంధీనగర్‌ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన గణేశ్‌.. మంచిర్యాలకు చెందిన సమీప బంధువు, వరుసకు అన్న అయిన వ్యక్తి భార్యతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయి. 

పదిరోజుల క్రితం సదరు మహిళ, గణేశ్‌ వరంగల్‌ నగరానికి వచ్చి ఉంటున్నారు. కాగా, ఆ మహిళ భర్త, పిల్లలు వారిని వెతుక్కుంటూ మంచిర్యాల నుంచి వరంగల్‌కు చేరుకున్నారు. వారిద్దరిని శుక్రవారం నర్సంపేటకు తీసుకువచ్చారు. ఎన్నిమార్లు చెప్పిన మీరు మారరంటూ గణేశ్‌ని చెట్టుకు కట్టేసి కొడుతుండగా ఆ మహిళ కొట్టదంటూ అడ్డువెళ్లడంతో ఆమెపైనా దాడి చేశారు.

దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై గుగ్గిళ్ల రామకృష్ణాచారి ఘటన స్థలానికి చేరుకుని విడిపించారు. చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గణేశ్, సదరు మహిళ ఫిర్యాదు మేరకు దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement