మళ్లీ మద్యం తాగి వాహనం నడుపుతా.. | Drunk Driver Challenges Traffic Police After 183 Alcohol Reading | Sakshi
Sakshi News home page

మళ్లీ మద్యం తాగి వాహనం నడుపుతా..

Nov 21 2026 12:15 PM | Updated on Nov 21 2026 1:09 PM

 Drunk Driver Challenges Traffic Police After 183 Alcohol Reading

హైదరాబాద్‌: ఇప్పుడు పట్టుకుంటే కోర్టు నుంచి వాహనం విడుదలైన తర్వాత మళ్లీ మద్యం సేవించి వాహనం నడుపుతానంటూ ఓ యువకుడు పోలీసులకే సవాల్‌ విసిరాడు.  డ్రంక్‌ అండ్‌ డ్రైవన్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులతో ఆ యువకుడు వాగ్వివాదానికి దిగి విధులకు ఆటంకం కలిగించడంపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18న రాత్రి 10.40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

ఈ సమ యంలో ఆ మార్గంలో యాక్టివా వాహనంపై వచ్చిన రణ«దీర్‌ (23)ను తనిఖీ చేశారు. బ్రీత్‌ఎనలైజర్‌ పరీక్షలో 183 మిల్లీగ్రాముల ఆల్కహాల్‌ రీడింగ్‌ నమోదైంది. వాహనం తాళం చెవి ఇవ్వాలని పోలీసులు కోరగా, అందుకు నిరాకరించి వారితో వాగ్వివాదానికి దిగారు. అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను ఉద్దేశించి అసభ్యకరమైన, కించపరిచే పదజాలంతో మాట్లాడాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, కోర్టు నుంచి వాహనం విడుదలైన తర్వాత మళ్లీ మద్యం సేవించి వాహనం నడుపుతానని సవాల్‌ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: విజిలెన్స్‌ వలలో తహసీల్దార్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement