విజిలెన్స్‌ వలలో తహసీల్దార్‌ | Koraput Tehsildar Driver Arrested for Accepting Rs12000 Bribe in Vigilance Trap | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ వలలో తహసీల్దార్‌

Nov 21 2026 11:46 AM | Updated on Nov 21 2026 11:51 AM

Koraput Tehsildar Driver Arrested for Accepting Rs12000 Bribe in Vigilance Trap

కేసు వివరాలు వెల్లడిస్తున్న విజిలెన్స్‌ ఎస్పీ శుశ్రీ

ఒడిశా: వ్యవసాయ భూమిని ఇంటి స్థలం భూమిగా మార్చేందుకు పట్టా మార్చేందుకు రూ,12 వేలు లంచం తీసుకున్న ఒక తహసీల్దార్, అతడి డ్రైవర్లు విజిలెన్స్‌ వలలో పడినట్లు కొరాపుట్‌ విజిలెన్స్‌ డివిజన్‌ జయపురం ఎస్పీ ఎస్‌.శుశ్రీ పత్రికా ప్రతినిధులకు శనివారం వెల్లడించారు. గోలుముండ తహసీల్దార్‌ చందన కుమార్‌ నాయిక్‌ (ఓఎ.ఎస్‌ )ని అతడి కారు డ్రైవర్‌ పంకజ్‌ సిప్కా లను అరెస్టు చేసినట్లు ఆమె వెల్లడించారు. విజిలెన్స్‌ ఎస్పీ వివరణ ప్రకారం ఫిర్యాదు దారుడు గత అక్టోబర్‌ 22 వ తేదీన తన వ్యవసాయ భూమిని ఇంటి స్థలంగా మార్చేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకున్నాడు. 

నవంబర్‌ 2 వ తేదీన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ విచారణ నివేదిక మ్యాప్‌లను సమర్పించారు. అయితే ఫైల్‌ ప్రాసెసింగ్, సవరించిన పట్టా కోసం రూ.10 వేలు, అతడి డ్రైవర్‌ కొరకు 2 వేలు వెరసి రూ.12 వేలు తహసీల్దార్‌ చందన కుమార్‌ డిమాండ్‌ చేసినట్లు ఆరోపణ. దీంతో ఫిర్యాదుదారు విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయించాడు. విజిలెన్స్‌ పథకం ప్రకారం గురువారం ఫిర్యాదు దారుడు తహసీల్దార్, డ్రైవర్లకు రూ.12 వేలు ఈయగా వేచి ఉన్న విజిలెన్స్‌ అధికారులు దాడి జరిపి ఇద్దరినీ పట్టుకున్నారు. వారి నుంచి 12 వేలు స్వా«దీన పరచుకున్నారు. నిందితుల ఇళ్ల వద్ద కూడా సోదాలు నిర్వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement