కార్తీక పౌర్ణమి వేళ ‘బీవర్ మూన్’.. మూడు సూపర్ మూన్‌లలో.. | Novembers Beaver Moon 2026 coincides with Kartik Purnima | Sakshi
Sakshi News home page

కార్తీక పౌర్ణమి వేళ ‘బీవర్ మూన్’.. మూడు సూపర్ మూన్‌లలో..

Nov 21 2026 11:41 AM | Updated on Nov 21 2026 11:44 AM

Novembers Beaver Moon 2026 coincides with Kartik Purnima

న్యూఢిల్లీ: ఈ నవంబర్ 24న ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆరోజు ఏర్పడనున్న బీవర్ మూన్‌ (Beaver Moon) హిందువులు పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమితో కలిసి రావడం విశేషం. ఈ ఏడాది చివర్లో వరుసగా ఏర్పడనున్న మూడు సూపర్ మూన్‌లలో ఇదే మొదటిది. నవంబర్ 23, 24 తేదీల్లో చంద్రుడు దాదాపు సంపూర్ణంగా కనిపించనున్నాడు.

నవంబర్‌లో పౌర్ణమి నాటి చంద్రుడిని ‘బీవర్ మూన్’ అంటారు.  ఉత్తర అమెరికాలో నవంబర్ నాటికి బీవర్లు (ఎలుక జాతిక చెందిన జీవులు) శీతాకాలం కోసం ఆహారాన్ని నిల్వ చేసుకుని, తమ గూళ్లు/ఆనకట్టలను నిర్మించుకుని వాటిలోకి చేరతాయి.ఈ సమయంలో వచ్చే చంద్రుడు కనుకనే ‘బీవర్‌ మూన్‌’ అంటారు.

రాయల్ మ్యూజియమ్స్ గ్రీన్విచ్ ప్రకారం.. నవంబర్ 24న ఉదయం 9.53 గంటలకు (అమెరికా తూర్పు కాలమానం) పౌర్ణమి గరిష్ఠ దశకు చేరుకుంటుంది. హిందూ పంచాంగం ప్రకారం.. నవంబర్ 23 రాత్రి 11.42 గంటలకు కార్తీక పౌర్ణమి తిథి ప్రారంభమై, నవంబర్ 24 రాత్రి 8.23 గంటలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా భక్తులు పూజలు, దానధర్మాలు, పవిత్ర స్నానాలు, దీపారాధనలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమినే దేవదీపావళిగా కూడా జరుపుకుంటారు.

ఇదీ చదవండి: ధరల సంక్షోభం: ‘క్యాటరింగ్‌’లు మూసివేత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement