ఐఐటీ ఖరగ్‌పూర్‌కు 75 ఏళ్లు.. ప్రత్యేక నాణెం విడుదల చేసిన మోదీ! | PM Modi Unveils coin marking-years of iit Kharagpur | Sakshi
Sakshi News home page

ఐఐటీ ఖరగ్‌పూర్‌కు 75 ఏళ్లు.. ప్రత్యేక నాణెం విడుదల చేసిన మోదీ!

Nov 21 2026 11:34 AM | Updated on Nov 21 2026 11:34 AM

PM Modi Unveils coin marking-years of iit Kharagpur

ఖరగ్‌పూర్: దేశంలోనే తొలి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అయిన ఖరగ్‌పూర్ ఐఐటీ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. సంస్థ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

1951లో ఏర్పాటైన ఐఐటీ ఖరగ్‌పూర్ దేశంలో సాంకేతిక విద్య, పరిశోధన, ఆవిష్కరణల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా 'వికసిత్ భారత్ కోసం 75 గొంతుకలు' కార్యక్రమంలో భాగంగా 75 మంది విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. సంస్థ అభివృద్ధి చేసిన వైద్య సాంకేతిక ఆవిష్కరణలు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందించే పరిష్కారాలను పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement