breaking news
markings
-
జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్
బంజారాహిల్స్: రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రోడ్డునెంబర్–12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు భూసేకరణలో భాగంగా పలు భవనాలకు మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ప్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ప్లాట్‌లో సగభాగం విస్తరణలో కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–1 రెండు రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. ఆయన సుమారుగా తన ప్లాట్‌లో 500 గజాల వరకు కోల్పోనున్నారు. అలాగే ఈ రోడ్డులో నివసిస్తున్న మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరుల ఇళ్లకు కూడా మార్కింగ్ వేశారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఒకవైపు ప్రాజెక్ట్ ఇంజనీర్లు సన్నద్ధం అవుతుండగా..ఇంకోవైపు కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎలా చూసినా ఈ ఆస్తుల సేకరణ తప్పేలా కనిపించడం లేదు. అంతా ప్రముఖులే కావడంతో రోడ్డు విస్తరణ పనులకు తమ స్థలాలను అప్పగించేందుకు ఎంతవరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభుత్వంపై కస్సుబుస్సుమంటున్నట్లు తెలుస్తోంది. మా ఇంటికే మార్కింగ్ వేస్తారా? అంటూ నిలదీతలు కూడా మొదలయ్యాయి. మరికొంతమంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకువెళ్తామని చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌లో ఒకవైపే.. బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణలో భాగంగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని అగ్రసేన్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రోడ్డుకు ఒకవైపే ఆస్తులు సేకరించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ 80 అడుగుల రోడ్డు మాత్రమే 120 అడుగుల వరకు విస్తరించనున్నారు. ఒకవైపు కేబీఆర్ పార్కు గోడ ఉండగా, ఆ ప్రాంతాన్ని ముట్టుకోవడం లేదు. సమరసింహారెడ్డి, జానారెడ్డి, బాలకృష్ణ తదితరులు ఉంటున్న వైపు మాత్రమే రోడ్డు విస్తరణ జరగనుంది. ఆ మేరకే మార్కింగ్ వేశారు. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 విరించి ఆస్పత్రి చౌరస్తా నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు ప్రస్తుతం 80 అడుగుల రోడ్డు ఉంది. దీనిని 100 అడుగుల మేర విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు రెండు వైపులా ఆస్తుల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 86 నివాసాలకు మార్కింగ్ చేశారు. ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు వాహనాల రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. అయితే పనులు ముందుకుసాగడంలోనే అధికారులకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. అంతా ప్రముఖులే కావడం, ప్రభుత్వంలో ఉండడం వల్ల వీరు తమ ఆస్తులు ఇవ్వడానికి ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది. -
పసిడి రికార్డుల పరుగు అంతర్జాతీయ అంశాల దన్ను
న్యూఢిల్లీ: బంగారం ధరలు అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా మంగళవారం పరుగుపెట్టాయి. అంతర్జాజీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర ఒక దశలో చరిత్రాత్మక రికార్డు 2,570.2 డాలర్ల స్థాయిని తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలి్చతే 20 డాలర్ల లాభంతో పటిష్టంగా 2,562 డాలర్ల పైన ట్రేడవుతోంది. అమెరికా మాంద్యం భయాలు, ఫెడ్ వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం.దేశంలోనూ దూకుడే.. ఇక అంతర్జాతీయ అంశాల దన్నుతో దేశీయంగా కూడా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పూర్తి 99.9 స్వచ్ఛత ధర రూ.1,400 పెరిగి రూ.74,150కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.73,800 స్థాయిని చూసింది. వెండి కేజీ ధర సైతం రూ.3,150 ఎగసి రూ.87,150కి చేరింది. ముంబైలో 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు రూ.837, రూ.834 చొప్పున పెరిగి వరుసగా రూ.71,945, రూ.71,657కు చేరాయి. వెండి ధర రూ.2,030 పెరిగి రూ.85,321కు పెరిగింది. -
సామాజిక దూరాన్ని పాటించేలా మార్కింగ్‌లు
-
ఇష్టారాజ్యం
రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS రూటే.. సెపరేటు మోరంపూడి – స్టేడియం రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని మాస్టర్‌ప్లా¯ŒSలో ప్రతిపాదనలు ఆ మేరకే కౌన్సిల్ తీర్మానం దాని ప్రకారమే సంతకం చేసిన మేయర్ ఆ తీర్మానాన్ని పట్టించుకోని అధికారులు 80 అడుగులకే పరిమితం చేస్తూ సర్వే.. మార్కింగ్‌లు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరాభివృద్ధిని 2031వ సంవత్సరం నాటికి ఊహిస్తూ రూపొందించిన మాస్టర్‌ప్లా¯ŒS అమలులో అనేక విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మాస్టర్‌ప్లా¯ŒS రూపొందించే బాధ్యతను నగరపాలక సంస్థ ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగించింది. మాస్టర్‌ప్లా¯ŒSలో మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని సూచించింది. అయితే దీనిని 80 అడుగులకు కుదించాలని అనేక వినతులు వచ్చాయి. ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఈమేరకు సిఫారసులు చేశారు. అయితే నగరంలో ఈ రోడ్డు చాలా ప్రధానమైనదని, ముఖ్యమైన పలు లింకు రోడ్లు ఈ రోడ్డులో కలుస్తున్నాయని పేర్కొంటూ అధికార యంత్రాంగం ఈ సిఫారసులను తోసిపుచ్చింది. 1971 మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారమే 80 అడుగులకు విస్తరించాల్సి ఉందని, ఇప్పుడు పెరిగిన రద్దీ దృష్ట్యా 100 అడుగులకు విస్తరించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే మాస్టర్‌ప్లా¯ŒS ఆమోదించిన రోజున చివరి నిమిషంలో గందరగోళం మధ్య ఐదుగురు కార్పొరేటర్లు ఈ రోడ్డును 80 అడుగులకే విస్తరించాలని నోటిమాట ద్వారా సిఫారసు చేశారు. వాటిని, విపక్ష కార్పొరేటర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్‌ప్లా¯ŒSను ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. అయితే అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో చర్చ జరగకుండానే అంతా 30 నిమిషాల్లోనే ముగించేశారు. నాటకీయ పరిణామాలు మాస్టర్‌ప్లా¯ŒS ఆమోదం తర్వాత ఐదుగురు కార్పొరేటర్లు తమ సిఫారసుల లేఖలను అధికారులకు అందజేశారు. మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డును 80 అడుగుల వరకే విస్తరించాలని కోరారు. దీనిపై రోజుల తరబడి చర్చ జరిగినట్లు సమాచారం. అయితే అత్యంత రద్దీ కలిగిన ఈ రోడ్డును ఆర్వీ అసోసియేట్స్, అధికార యంత్రాంగం పేర్కొన్నట్లు 100 అడుగులకే విస్తరించాలని మేయర్ స్పష్టం చేస్తూ వచ్చినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో సీనియర్ కార్పొరేటర్లు తమ ప్రతిపాదనలను నెగ్గించుకోవాలని పట్టుబట్టడం, మేయర్ వెనక్కు తగ్గకపోవడంతో ఈ తతంగం రెండు నెలలపాటు సాగింది. మాస్టర్‌ప్లా¯ŒSపై సంతకాల ప్రక్రియ ఆలస్యం కావడానికి ఈ రోడ్డు వ్యవహారం కూడా ఒక కారణమైంది. రెండు నెలలైనా మాస్టర్‌ప్లా¯ŒS ముందుకు కదలకపోవడంపై గత నెల 30న ‘సిఫారసుల లెక్క తేలలేదు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. పైగా కావాలనే మాస్టర్‌ప్లా¯ŒSపై సంతకాలు చేయకుండా నాన్చుతున్నారన్న ప్రచారం జరుగుతూండడంతో మేయర్ పంతం రజనీ శేషసాయి రెండు రోజుల క్రితం మాస్టర్‌ప్లా¯ŒSను ఆమోదిస్తూ సంతకం చేశారు. 80 అడుగులకే విస్తరించేలా జరుగుతున్న సర్వే 1971 మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డును 80 అడుగులకు విస్తరించాల్సి ఉంది. కానీ అనేక కారణాలవల్ల ఈ ప్రక్రియ ముందుకు కదల్లేదు. పరిహారంపై కూడా అనేక అభ్యంతరాలున్నాయి. ఇదిలా ఉండగా తాజా మాస్టర్‌ప్లా¯ŒS నేపథ్యంలో 15 రోజుల క్రితం ఈ రోడ్డు విస్తరణ ప్రక్రియ చేపట్టారు. నగరపాలక సంస్థ సర్వే విభాగం సిబ్బంది 80 అడుగుల మేర విస్తరించేలా కొలతలు తీసి, గోడలపై మార్కింగ్(గుర్తు)లు వేశారు. తాడితోట ప్రాంతంలో ఇప్పటికే ఇరువైపులా మార్కింగ్ పూర్తయింది. అత్యంత ప్రధానమైన రోడ్డు నగరంలోని ప్రధానమైన రోడ్లలో మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డు ఒకటి. ఈ రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సాగే ఈ రోడ్డులో నగరంలోని ఎనిమిది ముఖ్యమైన లింకు రోడ్లు కలుస్తాయి. వీఎల్ పురం రోడ్డు, తిలక్‌రోడ్డు, సోమాలమ్మ పుంత రోడ్డు, వెంకటేశ్వర హోల్‌సేల్ జనరల్ మార్కెట్ రోడ్డు, శీలం నూకరాజు ఫ్యాక్టరీ రోడ్డు, తాడితోట మహాత్మాగాంధీ హోల్‌సేల్ వస్త్ర దుకాణాల రోడ్డు, తాడితోట బైపాస్ రోడ్డు, తాడితోట ఇండస్ట్రియల్ లింకు రోడ్లు కలుస్తాయి. దాదాపు 60 అడుగుల వెడల్పుతో ఉన్న మోరంపూడి – స్టేడియం రోడ్డులో కలిసే లింకు రోడ్లు కూడా 30 నుంచి 60 అడుగుల వరకూ ఉన్నాయి. రోజూ ఈ రహదారిలో ట్రాఫిక్ జామ్ అవుతూంటుంది. అనేక విద్యా, వ్యాపార సంస్థలున్న ఈ రోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్, షెల్టాన్ హోటల్, తాడితోట జంక్షన్, స్టేడియం కూడలిలో నిత్యం ట్రాఫిక్ స్తంభించిపోతోంది. స్టేడియం నుంచి షెల్టా¯ŒS హోటల్ వరకూ రెండువైపులా దుకాణాలుండగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ ఒకవైపు మాత్రమే ఉన్నాయి. అక్కడినుంచి వీఎల్ పురం సెంటర్ వరకూ ఇరువైపులా అక్కడక్కడ మాత్రమే దుకాణాలున్నాయి. 90 శాతం మేర ఖాళీ స్థలాలు ఉన్నాయి. దీంతో ఈ రోడ్డును 100 అడుగులకు విస్తరించడం సులువే. కానీ, అధికారులు మాత్రం ఏ ఒత్తిళ్లకు లొంగారో కానీ.. కౌన్సిల్ తీర్మానానికి భిన్నంగా 80 అడుగులకే విస్తరించడం వివాదాస్పదమవుతోంది. మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారమే ఆమోదించాం ఆర్వీ అసోసియేట్స్, అధికార యంత్రాంగం మాస్టర్‌ప్లా¯ŒSలో పేర్కొన్న మేరకు మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డు విస్తరణను ఆమోదించాం. 80 అడుగులకు తగ్గించాలన్న సిఫారసులను తోసిపుచ్చాం. ఈ రోడ్డులో రద్దీ ఎక్కువ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డును విస్తరణ చాలా సులువు. చాలావరకూ ఖాళీ స్థలాలున్నాయి. – పంతం రజనీ శేషసాయి, మేయర్, రాజమహేంద్రవరం డీటీసీపీ కార్యాలయానికి పంపాం ఈ రోడ్డు విస్తరణపై వచ్చిన అభ్యంతరాలను డీటీసీపీ కార్యాలయానికి పంపించాం. ఆ అభ్యంతరాలు పరిశీలించి, తుది ముసాయిదా వచ్చిన తర్వాత ఎంతమేరకు విస్తరించాలనేది తెలుస్తుంది. – వి.విజయరామరాజు, కమిషనర్, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ