ఇక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెడికల్‌ పీజీ!  | IIT Kharagpur to offer PG medical courses from 2026-27 academic year | Sakshi
Sakshi News home page

ఇక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెడికల్‌ పీజీ! 

Nov 13 2026 3:17 AM | Updated on Nov 13 2026 3:17 AM

IIT Kharagpur to offer PG medical courses from 2026-27 academic year

నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి 

న్యూఢిల్లీ: దేశం గర్వించదగ్గ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇకపై ఇంజనీరింగ్‌ మాత్రమే కాదు.. వైద్యమూ నేర్పుతారు. అది కూడా పీజీస్థాయిలో. 2026–27 విద్యా సంవత్సరంలోనే ఈ కోర్సుల ప్రారంభానికి ఇందుకు జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ పచ్చజెండా ఊపింది. దీంతో వైద్యవిద్యలో పీజీ కోర్సు అందించే మొట్టమొదటి ఐఐటీగా ఖరగ్‌పూర్‌ రికార్డు సృష్టించనుంది. 

డాక్టర్‌ బి.సి.రాయ్‌ మల్టీ స్పెషాలిటీ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో తొలి బ్యాచ్‌ కోర్సులు నిర్వహించనున్నారు. ఖరగ్‌పూర్‌లోనే దేశంలోని మొదటి ఐఐటీ ఏర్పాటైందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అడ్మిషన్లు నీట్‌–పీజీ ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ ఆధారంగా జరుగుతాయని ఐఐటీ విడుదల చేసిన అధికారిక ప్రకటన తెలిపింది.  జనరల్‌ మెడిసిన్‌తోపాటు రేడియాలజీ, ఫిజియాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, బయో కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో రెండేసి సీట్లు చొప్పున అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement