ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)తో ఎంఐఎం దోస్తీ
సామాజిక పరివర్తన్ మోర్చా పేరుతో కూటమి ఏర్పాటు
చంద్రశేఖర్ ఆజాద్‌ను సీఎం అభ్యరి్థగా ప్రకటించిన ఒవైసీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో కొత్త కూటమి రూపుదిద్దుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ చేతులు కలిపారు. బీజేపీని మూడో విడత అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ఇద్దరు నేతలు ‘సామాజిక పరివర్తన్ మోర్చా’(ఎస్‌పీఎం) పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు.
గురువారం లక్నోలో మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ కూటమి పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ కూటమికి ప్రధాన అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి అభ్యరి్థగా చంద్రశేఖర్ ఆజాద్ పేరును అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. యూపీలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకోవడానికి ఇదొక బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఒవైసీ అన్నారు.
ప్రధాన రాజకీయ పారీ్టలన్నీ దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో దిగజారుతున్న విద్యా వ్యవస్థ, యువతలో పెరిగిపోతున్న నిరుద్యోగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే తమ ప్రధాన అజెండా అని చెప్పారు. ఈనెల 26న చేపట్టే భారీ బహిరంగ సభ ద్వారా రాష్ట్రంలో సామాజిక మార్పు ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు.
మాదే మొదటి ఫ్రంట్: ఆజాద్
యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావద్దనుకునే సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ సహా ఏ పార్టీ అయినా తమ కూటమిలో చేరవచ్చని ఆజాద్ చెప్పారు. ఆ పారీ్టలను పెద్ద మనస్సుతో ఆహ్వానిస్తున్నామన్నారు. ‘మాది థర్డ్‌ఫ్రంట్ అని కొందరంటున్నారు. అది సరికాదు. అణగారిన, పీడిత,க்க, వెనుకబడిన వర్గాలకు ఒక బలమైన రాజకీయ వేదికగా ఆవిర్భవించనున్నది మా కూటమి. ఇది మూడో కూటమి కాదు. వాస్తవానికి సామాజిక మార్పును కోరుకునే మొదటి కూటమి మాదే’అని ఆయన పేర్కొన్నారు.
ఇండియా కూటమితో కటీఫ్!
వాస్తవానికి యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌లతో కలిసి ‘ఇండియా’కూటమిలో భాగస్వామి కావాలని ఒవైసీ ప్రయతి్నంచారు. సీట్ల సర్దుబాటుపై అక్టోబర్ 2వ తేదీ లోగా స్పందించాలని ఆయన గడువు విధించినప్పటికీ, అటు నుంచి సానుకూల స్పందన లభించలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా దళిత యువతలో మంచి పట్టున్న చంద్రశేఖర్ ఆజాద్‌తో దోస్తీకి మొగ్గుచూపారు.
దళిత, ముస్లిం ఓట్లను ఏకం చేయడం ద్వారా యూపీలో తమ బలాన్ని విస్తరించుకోవాలని ఇరు పారీ్టలు భావిస్తున్నాయి. ప్రస్తుతం యూపీలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమికి, ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పుడు ‘సామాజిక పరివర్తన్ మోర్చా’రాకతో పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. గత ఎన్నికల్లో బీజేపీ 255 సీట్లు గెలుచుకోగా, ఎస్పీ 111 స్థానాలకు పరిమితమైంది. బీఎస్పీ 1, కాంగ్రెస్ 2 సీట్లు మాత్రమే గెలిచాయి.
2022లో ఎంఐఎం 95 స్థానాల్లో పోటీ చేసి ఖాతా తెరవకపోయినా 0.49 శాతం ఓట్లు సాధించింది. ఆజాద్ పార్టీ కూడా ఒక్క సీటూ గెలవలేదు. మరోవైపు, దళిత ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి 2027 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దళిత, ముస్లిం ఓట్లను ఆకర్షించడంలో ఒవైసీ–ఆజాద్ కూటమి ఎంతవరకు సఫలమవుతుంది, ప్రధాన పారీ్టల గెలుపోటములను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


