పశ్చిమాసియా యుద్ధం.. డీజిల్ ధరల భారాన్ని కేంద్రమే భరించింది : ప్రధాని మోదీ | PM Modi Government Absorbed Rs 43 Per Litre Diesel Hike To Protect Farmers | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా యుద్ధం.. డీజిల్ ధరల భారాన్ని కేంద్రమే భరించింది : ప్రధాని మోదీ

Nov 13 2026 1:54 AM | Updated on Nov 13 2026 1:54 AM

PM Modi Government Absorbed Rs 43 Per Litre Diesel Hike To Protect Farmers

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన తీవ్ర ఆర్థిక భారాన్ని రైతులకు, సామాన్యులపై భారం పడకుండా  కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది. ‘కిసాన్ తక్ భారత్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్’లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక విషయాలను వెల్లడించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌  70 డాలర్ల నుంచి ఏకంగా 122 డాలర్లకు ఎగబాకిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పరిణామాల కారణంగా డీజిల్ ధరను లీటరుకు దాదాపు రూ. 50 మేర పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అయితే ఆ భారాన్ని పూర్తిగా పౌరులపై, రైతులపై మోపకుండా ప్రభుత్వం కేవలం రూ. 7 మాత్రమే పెంచిందని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన రూ. 43 లీటరు భారాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరించిందని మోదీ ప్రకటించారు.

నెలవారీగా రూ. 14,000 కోట్ల భారం
అంతర్జాతీయ మార్కెట్‌లోని ఒడుదొడుకుల నుంచి వినియోగదారులను, రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ. 14,000 కోట్ల ఆర్థిక భారాన్ని తన భుజాన వేసుకుంటున్నట్లు ప్రధాని గుర్తు చేశారు. పొరుగు దేశాలతో పోలిస్తే అక్కడ డీజిల్ ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగినప్పటికీ, భారతదేశంలో మాత్రం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement