నాన్ బ్రేకింగ్ న్యూస్ కార్యక్రమానికి రావడం సంతోషం: నరేంద్ర మోదీ | PM Modi with media representatives at the Diwali Milan program | Sakshi
Sakshi News home page

నాన్ బ్రేకింగ్ న్యూస్ కార్యక్రమానికి రావడం సంతోషం: నరేంద్ర మోదీ

Nov 12 2026 6:33 PM | Updated on Nov 12 2026 6:36 PM

PM Modi with media representatives at the Diwali Milan program

ఢిల్లీ : స్వతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి అయ్యే సమయానికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. నగరంలోని బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌లో మీడియాఓ ప్రతినిధులతో నరేంద్ర మోదీ దీపావళి మిలన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్‌ నబీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. 

దీనిలో భాగంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. మీడియా సకారాత్మక ధోరణిలో పని చేస్తోంది. ప్రపంచంలో ఇండియా స్టోరీ  వినిపించే దిశగా మీడియాకృషి చేయాలి. భారత్ సాధించిన విజయాలు,  వ్యక్తుల విజయాలపై  స్టోరీలు రావాలి. ఇదే మీరు దేశానికి చేసే సేవ ఆ లక్ష్యం కోసం అందరం కలిసి పని చేయాలి. డ్రగ్స్ విముక్తి,  దేశ ఐక్యత,  వికసిత్ భారత్ వంటి విషయాలపై  మీడియా చోటు కల్పించాలి. 

మీడియా వార్తలకు డెడ్ లైన్ ఉన్నట్లుగానే. .. వికసిత్ భారత్ సాధించేందుకు 2047 డెడ్ లైన్. స్వతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి అయ్యే సమయానికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. మేముపెట్టుకున్న ఏ లక్ష్యం అసాధ్యం కాదు. 12 ఏళ్లకిందట మట్టిరోడ్డుకు వినతిపత్రం ఇచ్చే వారు...ఇప్పుడు ఎక్ష్ప్రెస్స్ వే లు నిర్మిస్తున్నాం. రైల్వేలు పూర్తిగా విద్యుదీకరణ చేశాం. 12 ఏళ్లల్లో 50 కోట్ల మందిని కడు పేదరికంనుంచి బయటకి తీసుకువచ్చాము. 

కుటుంబాన్ని పక్కన పెట్టి ఫీల్డ్ రిపోర్టర్స్ క్షేత్ర స్థాయిలో పూర్తి శక్తితో పని చేయడం స్ఫూర్తి నింపుతుంది. చిన్న, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వికసిత్ భారత్ సాధించాలి. అందరికి ఇళ్ళు అనే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు వేగంగా ముందుకు వెళుత్తున్నాం. బ్రేకింగ్ వార్తల కోసం పరుగులు తీసే మీడియా. ..నాన్ బ్రేకింగ్ న్యూస్ కార్యక్రమానికి రావడం సంతోషం. 

ప్రెస్ రిలీజ్ కూడా పంపేందుకు కష్టంగా రోజులు చూశా. అప్పట్లో మీడియా తో మంచి ఆత్మీయ సంబంధాలు ఉండేవి. ఈ అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాం. రిపోర్టర్ నుంచి ఎడిటర్ గా మారినట్లు,  నా బాధ్యత కూడా మారింది. ఒక రోజు మహిళా ప్రతినిధుల బృందం వచ్చి మీరు సీఎం అవుతున్నారు. ..మిఠాయి తినిపించాలని అడిగారు. నాకంటే ముందు వారికి ఈ విషయం తెలిసింది.  ఆ తరవాత ఎన్నో మారాయి. టెక్నాలజీ మారి మీడియా స్వరూపం మారింది. మీడియాకు కూడా సవాళ్లు కూడా పెరిగాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్... ఓబీ యూనిట్ గా మారింది’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: డీలిమిటేషన్ బిల్లుపై కీలక అడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement