ఆఫీసు దీపావళి వేడుకల్లో ఒక మహిళ ఉత్సాహంగా చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పండుగ సంబరాల్లో భాగంగా ఆమె ఎంచుకున్న పాట , డ్యాన్స్ స్టెప్పులపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పండగ పూట ఇదేం డ్యాన్స అని విమర్శిస్తే.. మరికొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు.
'అన్షీ మాలిక్' (Anshii Malik) అనే ఇన్‌స్టా యూజర్ తన ఆఫీసు దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వైట్ చీరలో అన్షీ.. డీసీ మదానా పాడిన ప్రముఖ హర్యాన్వీ పాట 'తేరీ ఆఖ్యా కా యో కాజల్' (Teri Aakhya Ka Yo Kajal) కు ఉత్సాహంగా స్టప్పులేశారు. దీంతో సహోద్యోగులు కలిసి పోజులివ్వడం, పలువురు ఆమెను తమ ఫోన్లలో రికార్డు చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పాట బీట్‌కు అనుగుణంగా ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తోంటే వారంతా చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు.
y">
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ దీపావళికి మీరే ఒక పటాకా అయినప్పుడు" అని క్యాప్షన్ ఇస్తూ, సహోద్యోగులతో కలిసి సరదాగా చేసుకున్న వీడియోను షేర్ చేశారు. అయితే, ఈ వీడియోపై ఆన్‌లైన్‌లో భిన్న స్పందనలు వచ్చాయి. ఆఫీసు వేడుకల్లో ఇలాంటి డ్యాన్స్ చేయడం సరికాదని కొందరు విమర్శించారు దీపావళి అంటే ఇలాగా జరుపుకునేది అని ఒకరు కామెంట్ చేశారు. మరీ అసహ్యంగా ఉందంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
పని ప్రదేశంలో ఇలాంటి డ్యాన్స్‌లు చేయడం పట్ల మరొకరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అవకాశం దొరికినప్పుడల్లా ప్రజలు "ఇలాంటి చీప్ బాలీవుడ్ డ్యాన్స్‌లు" అంటూ విమర్శించారు. ఇలాంటి ప్రదర్శనలు మహిళా సహోద్యోగులపై అనవసరమైన గాసిప్‌లు, అసభ్యకర వ్యాఖ్యలకు దారితీస్తాయని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వీడియోపై ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఆ డ్యాన్స్‌లో అసభ్యకరంగా ఏమీ లేదంటూ ఆమెకు ఒకరు మద్దతుగా నిలిచారు. మొత్తానికి, ఆఫీసు దీపావళి వేడుకల్లో సరదాగా చేసిన ఈ డ్యాన్స్ వీడియో, పని ప్రదేశాల్లో వేడుకలు ఎలా జరుపుకోవాలి అనే అంశంపై చర్చకు దారితీసింది.
కాగా వీర్ దహియా సాహిత్యం అందించగా, డీసీ మదానా పాడిన ఈ పాట 'సూట్ తేరా పత్లా వాల్యూమ్ 2' ఆల్బమ్‌లోనిది. ప్రముఖ డ్యాన్సర్ సప్నా చౌదరి స్టెప్పుల వల్ల ఈ పాట దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. పెళ్లిళ్లు, పార్టీలలో ఈ పాట సర్వసాధారణంగా మారిపోయింది. గతంలో ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో జరిగిన 'కింగ్స్ డే' వేడుకల్లో కూడా విదేశీయులు ఈ పాటకు డ్యాన్స్ చేయడం విశేషం.


