దీపావళి కాలుష్యం.. యోగి సంచలన వ్యాఖ్యలు | Yogi Adityanath Defends Bursting Of Crackers On Diwali | Sakshi
Sakshi News home page

దీపావళి కాలుష్యం.. యోగి సంచలన వ్యాఖ్యలు

Nov 11 2026 1:54 PM | Updated on Nov 11 2026 1:55 PM

Yogi Adityanath Defends Bursting Of Crackers On Diwali

‘‘అవినీతి చేసేవారిని ఎవరూ ప్రశ్నించరు.. దీపావళి బాణసంచా మాత్రమే కొందరికి సమస్య’’ అంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి వేడుకల్లో టపాసులు కాల్చడాన్ని యోగి ఆదిత్యనాథ్‌ సమర్థించారు. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల కొంత కాలుష్యం ఏర్పడినా.. అది కొంతకాలానికి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. అయితే, అవినీతి కారణంగా వ్యవస్థ మొత్తం కలుషితమవుతున్నప్పుడు ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు.

దీపావళి వేడుకలపై తమ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. ప్రజలు పండుగను పూర్తి ఉత్సాహంతో జరుపుకోవాలని ప్రోత్సహించిందని యోగి తెలిపారు. ధన్‌తేరస్‌ సందర్భంగా మార్కెట్లలో కనిపించిన సందడిని ప్రతి ఒక్కరూ గమనించే ఉంటారు. కొత్తగా నియమితులైన జూనియర్‌ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను అయోధ్యలో ఉన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతూ పండుగను ఆనందంగా జరుపుకోవడం చూశానని తెలిపారు. 2017లో బీజేపీ అధికారంలోకి రాకముందు ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు మరోలా ఉండేవన్న యోగి.. హోలీ, దీపావళి, విజయదశమి, జన్మాష్టమి, శివరాత్రి, క్రిస్మస్‌, ఈద్‌, గురుపర్వ్‌, మకర సంక్రాంతి వంటి పండుగలు వచ్చిన ప్రతిసారీ ముందు మత ఘర్షణలు, అల్లర్లు జరిగేవని గుర్తు చేశారు.

కాగా, దీపావళి వేడుకలు ముగిసిన మరుసటి రోజు సోమవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత ఒక్కసారిగా పడిపోయింది. అధికారిక గణాంకాల ప్రకారం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 483కు చేరుకుని తీవ్ర (సివియర్‌) స్థాయికి పడిపోయింది. గాలిలోని కాలుష్య కారకాల ప్రభావాన్ని పర్యవేక్షించే స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్‌ వంటి ప్రైవేటు సంస్థలు కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 1,000 దాటినట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి: అస్సాం రైలు ప్రమాద దృశ్యాలు.. లైవ్‌ వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement