మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. గోపాలకృష్ణన్ ఇంటికి వెళ్లి ఆయన కుమార్తె పెళ్లికి శుభాకాంక్షలు తెలుపడం సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. నవంబర్ 1న జరిగిన గోపాలకృష్ణన్ కుమార్తె వివాహానికి హాజరుకాలేకపోయిన మమ్ముట్టి, ఆ తర్వాత ఆదివారం సాయంత్రం త్రిస్సూర్ లోని ఆయన ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, కొంతమంది విమర్శలను గుప్పించారు. మతతత్వ పార్టీ నేతతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండకూడదని దుయ్యబట్టరాఉ. గతంలో వయనాడ్ కొండచరియల బాధితుల ప్రాంతాన్ని దర్శించిన సమయంలో ఓ సీపీఐ(ఎం) నాయకుడిని తమతో రావద్దని మమ్ముట్టి అన్నారనే సంఘటనను గుర్తుచేస్తూ, ఆయన ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారంటూ ట్రోల్ చేశారు.
ఇదీ చదవండి: 40 ఏళ్లకే పక్షవాతం: ఎయిర్‌టెల్ మాజీ సీఓఓ సంచలన వ్యాఖ్యలు
#Mammootty visits BJP State Vice President B. Gopalakrishnan’s residence to extend his wedding wishes to his daughter. https://t.co/jtGbmvJI94
— Kerala Trends (@KeralaTrends2) November 8, 2026
అయితే ఈ విమర్శలను, సోషల్ మీడియా ట్రోలింగ్‌ను బీజేపీ నేత గోపాలకృష్ణన్ ఖండించారు. వ్యక్తిగత సంబంధాలను రాజకీయ కోణంలో చూడకూడదని పేర్కొన్నారు. కేరళలో ఉండే మంచి పద్ధతిని, మనుషుల మధ్య అనుబంధాలను రాజకీయాల పేరిట నాశనం చేయవద్దని పిలుపునిచ్చారు. స్నేహం అనేది రాజకీయాలు, మతం, కులం, భాష, దుస్తులు, వర్ణానికి అతీతమైనదని ఆయన ఆరోపించారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు పలువురు వామపక్ష పార్టీల కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెళ్లికి వచ్చారని గోపాలకృష్ణన్ గుర్తు చేశారు.
సీపీఎం వివరణ
మరోవైపు వామపక్ష వాదులు మమ్ముట్టిపై విమర్శలు గుప్పించారన్న ఆరోపణలపై స్పందించిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఈ వివాదానికి తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ దాడితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సీపీఎం సీనియర్ నేత, థామస్ ఐజాక్, రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ స్పష్టం చేశారు. మమ్ముట్టి రాష్ట్రం గర్వించదగ్గ నటుడని, ఆయనతో తమ పార్టీకి మంచి సంబధాలున్నాయని పేర్కొన్నారు. నెటిజన్ల వ్యాఖ్యలు పార్టీ అధికారిక వైఖరి కాదని తేల్చి చెప్పారు. నటుడిని విమర్శించే వారికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు. దీనికి వెనుక సైబర్ ఫాలోయర్ల పన్నాగం ఉండి ఉచ్చన్నారు.
మమ్ముట్టి సీపీఐ(ఎం)తో అనుబంధం ఉన్న 'కైరళి టీవీ'కి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఆయన లెఫ్ట్ భావజాలానికి దగ్గరగా ఉంటారనే భావన ఉన్నప్పటికీ, రాజకీయేతరంగా నాయకుడి ఇంటికి వెళ్లడంపై ఇలా విమర్శలు రావడం కేరళ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


