breaking news
Malayala star hero
-
నగల యాడ్ హీరోయిన్లే చేయాలా ఏంటి..?
మలయాళ టాప్ హీరో మోహన్ లాల్ నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల కూడా ప్రశంసలు కురిపిస్తారు. మరోసారి తనను భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ నటుడిగా ఎందుకు భావిస్తున్నారో నిరూపించుకున్నారు. తాజాగా ఆయన నటించిన బంగారు ఆభరణాల ప్రకటన నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణంగా బంగారు అభరణాలకు సంబంధించిన యాడ్స్లలో హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తారు. అయితే, ఈ దిగ్గజ నటుడు కనీసం ఒక్క డైలాగ్ కూడా లేకుండా ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం తన నటనతోనే ఆశ్చర్యపరిచాడు. ఈ వాణిజ్య ప్రకటనలో పూర్తిగా అతని కళ్ళు, హావభావాలు మాత్రమే పలికించాడు. అదరహో అనిపించేలా మోహన్ లాల్ కనిపిస్తాడు.'తుడరుమ్' చిత్రంలో మోహన్ లాల్‌తో కలిసి నటించిన, ప్రఖ్యాత యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రకాష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ వాణిజ్య ప్రకటన 110 సెకన్ల నిడివితో ఉంది. మోహన్ లాల్ కారు దిగగానే.. సెట్లో ఉన్న ప్రకాష్ స్వాగతం పలుకుతాడు. 'మేము దీనిని ఫ్యాషన్ ఫోటోగ్రఫీ శైలిలో చిత్రీకరించాము' అంటూ మోడల్ శివానీని మోహనల్లాక్కు పరిచయం చేస్తాడు. యాడ్ కోసం ఆమె ధరించిన వజ్రాల ఆభరణాన్ని ఎవరికీ చెప్పకుండా మోహన్ లాల్ తీసుకుని తన వానిటీ వ్యాన్‌లోకి తీసుకెళ్తాడు. అద్దం ముందు నిలబడి తన మెడలో వజ్రాల అభరణాన్ని ఆయన ధరిస్తాడు. ఆ సమయంలో ఆయన పలికించే హావభావాలు అందరినీ ఆకట్టుకుంటాయి.ఇలా కేవలం మోహన్‌లాల్ మాత్రమే నటించగలరని నెటిజన్లు అభినందిస్తున్నారు. నగలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలలో హీరోయిన్లే కనిపించాలా ఏంటి...? అంటూ మరోకరు చెప్పుకొచ్చారు. ఇలా స్త్రీ హావభావాలు పలికించడం చాలా కష్టం.. కానీ, మోహన్‌లాల్ చాలా సులువుగా మెప్పించారు. దటీజ్ మోహన్‌లాల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందుకే ఆయన జాతీయ నటుడు అయ్యారు అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. -
పుష్ప విలన్ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్.. స్పెషల్ ఏంటి?
సినీ తారలు ధరించే దుస్తులు మొదలు..వాళ్లు వాడే వస్తువుల వరకు.. ప్రతిదీ చాలా ఖరీదైనవి ఉంటాయి. ట్రెండ్‌కు తగ్గట్లుగా వాళ్ల వస్తువులు మారుతుంటాయి. ముఖ్యంగా వాహనాలు, మొబైల్ ఫోన్ల విషయంలో స్టార్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ మోడల్ని తీసుకుంటారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఇప్పటికీ 17 ఏళ్ల క్రితం కొన్న ఫోన్‌నే వాడుతున్నాడు. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కీప్యాడ్ ఫోన్‌నే ఉపయోగిస్తున్నాడు. ఆ స్టార్ ఎవరో కాదు పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. ఆయన వాడుతున్న ఫోన్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇటీవల మలయాళ దర్శకుడు అభినవ్ సుందర్ సినిమా ఓపెనింగ్ ఈవెంట్లో ఫహద్ పాల్గొన్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా ఆ విజువల్స్‌ని అక్కడి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందరూ ఆయన వాడుతున్న ఫోన్ గురించే చర్చించడం మొదలు పెట్టాడు. స్మార్ట్ ఫోన్ కాదని ఈ ఫోన్ ఎందుకు వాడుతున్నాడా? అని ఆరా తీస్తున్నారు. ఇక ఆ ఫోన్ విషయానికొస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో దాని ధర రూ. 5-54 లక్షల వరకు ఉండేదట. ఇది ఒక అల్ట్రా-లగ్జరీ నాన్-స్మార్ట్‌ఫోన్. 2007లో అనౌన్స్ చేసి.. 2008లో ఆ ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ ఫోన్ టైటానియంతో తయారు చేశారట. నీలమణి స్పటికలతో పాటు చేతితో కుట్టిన లెదర్‌తో పైభాగం కప్పబడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో మార్కెట్లో లేదు కానీ ప్రీ-ఓన్డ్ వెబ్సైట్లలో రూ.1–1.5 లక్షలకు దొరుకుతుంది. ఈ ఫోన్లో స్మార్ట్‌ఫోన్ లాంటి ఆధునిక ఫీచర్లు లేనప్పటికీ దాని బ్రాండ్ విలువ, అరుదైన డిజైన్ కారణంగా ఆ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. ఫహద్ లాంటి స్టార్ నటుడు ఇంత పాత ఫోన్‌ను ఉపయోగించడం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఆయన సింప్లిసిటీకి ఇది నిదర్శనం అంటుంటే..మరికొందరు పాత వస్తువుల పట్ల ప్రేమను చూపిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.సినిమాల విషయానికొస్తే.. కుంభసారం’, ‘తొండిముతలం ద్రిక్సాక్షియం’, ‘మాలిక్’ వంటి చిత్రాలతో అతను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసు అధికారి షేకావత్ పాత్రలో ఫహద్ అద్భుతంగా నటించాడు. ఆయన తాజా చిత్రం మారేసన్ మూవీ జులై 25న విడదల కాబోతుంది. -
డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...
మాతృత్వపు మధురిమ ఎవరికైనా అపురూపం. ఆ క్షణాలు కాబోయే తల్లులందరికీ భావోద్వేగభరితంగా ఉంటాయి. క్షణం క్షణం ఉత్కంఠ.. ఒకపక్క భరించలేని ప్రసవ వేదన..మరోవైపు వచ్చే బుడతడు కోసం ఆస్పత్రి బయట బంధువుల పడిగాపులు..అదంతా ఓ అపురూపమైన క్షణం. మర్చిపోలేని ప్రసవానుభవం కూడా. అలాంటి మధుర క్షణాలను చాలా రియలిస్టిక్‌గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్‌ని త్వరగా చదివేయండి మరీ..మలయాళ నటుడు, బిజేపీ నాయకుడు కృష్ణ కుమార్ కుమార్తె దియా కృష్ణ నెట్టింట తన ప్రసవ అనుభవానికి సంబంధించిన వీడియోని షేర్ చేసుకున్నారు. అది కేవలం డెలివరీ సమయంలోని పరిస్థితులు కాదు..మొత్తం ఆస్పత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి నొప్పులు మొదలు..బిడ్డను కని డిశ్చార్జ్ అయ్యి వచ్చే వరకు మొత్తం తతంగాన్ని ఆమె చాలా చక్కగా రికార్డు చేశారు. ప్రతి దృశ్యం కదిలించేలా ఉంటుంది. ప్రసవ సమయంలో ఇలా ఉంటుందా అనే ఫీల్‌ని తెప్పిస్తుంది. ఇక్కడ దియా డెలివెరికి వెళ్లే క్షణంలో అందంగా మేకప్ వేసుకుని మరీ వెళ్తుంది. ఎందుకంటే మొటిమలతో ఉన్న ముఖంతో నా బిడ్డకు స్వాగతించడం ఇష్టం లేదంటూ చెప్పడం వీడియోలో చూడొచ్చు. అయితే ఆమె మొటిమలు చెడ్డవి కావు గానీ..నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకే ఇలా అని చెబుతుంది వీడియోలో. ఆ వీడియోలో భర్త, ఆమె తల్లిదండ్రులు ప్రసవ వేదన సమయంలో ఓదార్చడం, వైద్య సిబ్బంది మద్దతు తదితర దృశ్యాలన్ని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. చివర్లో ఆమె చేతుల్లో బిడ్డను పెట్టే అపురూపమైన క్షణం అత్యంత అద్భుతంగా ఉంటుంది. దియా ఇందులో ఆధునిక వైద్య విధానం ఎలా ఉందో తెలియజేసేందుకే ఇదంతా షూట్ చేసినట్లు చెప్పుకొచ్చారామె. ఇక ఇక్కడ దియాకి సుఖ ప్రసవం అయ్యింది. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఈ వీడియో క్లిప్ షేర్ చేసిన మూడు రోజుల్లోనే ఆరు మిలయన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా, నెటిజన్లు మాత్రం అందరిలా కాకుండా ప్రతీది రియలిస్టిక్‌గా ప్రసవ సమయంలో ఉండే ఉద్విగ్న స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారని ఆమెని ప్రశంసించగా, మరికొందరు మాత్రం ఇలాంటివి ఎందుకు చిత్రీకరిస్తారని మండిపడుతూ పోస్టులు పెట్టారు. (చదవండి: 71 ఏళ్ల వయసులో సీఏ అయ్యాడు..! మనవరాలి కోసం..) -
స్టార్ హీరో లేటేస్ట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బిగ్ షాక్!
మలయాళ స్టార్ మోహన్‌లాల్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో కనిపించారు. అయితే ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని షాకిచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఝలక్ ఇచ్చింది. కేవలం రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో మలయాళంలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది మలైకోట్టై వాలిబన్. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
మహిళా యాంకర్ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్
ప్రముఖ మలయాళ నటుడు, స్టార్ హీరో శ్రీనాథ్ భాసీని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనాథ్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ సోమవారం ఓ మహిళా యాంకర్ కేరళలోని మరడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఇంటర్య్వూలో పాల్గొన్న హీరో శ్రీనాథ్ మధ్యలో అసభ్యపదజాలంతో తనని దూషించాడని, కోపంతో దుర్భాషలాడంటూ సదరు యాంకర్ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: టిమిండియాకు రామ్ చరణ్ విందు! అయితే అరెస్టయిన కొద్ది సేపటికే శ్రీనాథ్ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం. వివరాలు.. ‘కప్పెలా’, ‘భీష్మ పర్వం’, ‘ట్రాన్స్’ వంటి చిత్రాలతో మలయాళంలో స్టార్ హీరోగా మారాడు శ్రీనాథ్ భాసీని. ఆయన లేటెస్ట్ మూవీ చట్టంబి అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలు అడిగిన సందరు మహిళా యాంకర్‌పై హీరో శ్రీనాథ్ విరుచుకుప్డడాడు. చదవండి: అప్పుడే ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్, ఎక్కడంటే.. యాంకర్ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పదజాలంతో దుర్భాషలాడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా శ్రీనాథ్ తనతో అసభ్యంగా మట్లాడిన మాటలకు సంబంధించిన రికార్డ్‌ను కూడా ఆమెకు పోలీసులకు ఇచ్చింది. దీంతో అతడిపై 354, 509, 294బీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి చేశారు. ఈ మేరకు హీరోని విచారించిన పోలీసులు సోమవారం సాయంత్రం అతడిని అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్‌ను శ్రీనాథ్ ఖండించాడు. యాంకర్ తనను అగౌరవపరుస్తూ ప్రశ్నలు అడగడంతో తాను సహనం కోల్పోయానని అతడు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
'తెలుగు నేర్చుకుంటున్నా..!'
దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న మోహన్ లాల్, తను ఆ స్టేటస్‌కు ఎందుకు అర్హుడో మరోసారి ప్రూవ్ చేశాడు. ఇప్పటికే నటుడిగా ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్న మోహన్ లాల్, ఇప్పటికీ ప్రతి సినిమా కోసం ఎంతో హోం వర్క్ చేస్తారు. మలయాళంతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించిన ఈ మెగాస్టార్ త్వరలో రెండు తెలుగు సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్)లో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాతో పాటు విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహిమ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండూ 2016లోనే రిలీజ్ కానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల కోసం ప్రత్యేకంగా తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నాడు మోహన్ లాల్. కథలోని భావాన్ని సరిగ్గా పలికించాలంటే భాష మీద పట్టు ఉండాలనే ఉద్దేశంతో తెలుగు భాషను అభ్యసిస్తున్నాడు. మలయాళంలో డబ్ అవుతున్న తెలుగు సినిమాలకు మాటల రచయితగా వ్యవహరిస్తున్న వ్యక్తి సాయంతో తెలుగు భాష మీద పట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు మోహన్ లాల్. చాలారోజులుగా ఇదే పనిలో ఉన్న ఈయన.. తాజాగా తన ట్విట్టర్ పేజ్‌పై స్వయంగా తెలుగులో పోస్ట్ పెట్టాడు. 'తెలుగు నేర్చుకోవడం..!' అంటూ తన ఫొటోను ట్వీట్ చేశాడు మోహన్ లాల్. తెలుగు నేర్చుకోవడం pic.twitter.com/7YPhpe4akI — Mohanlal (@Mohanlal) December 29, 2015