డెలివరీ ప్రాసెస్‌ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె... | Actor And BJP Leader Krishna Kumari Daughter Diya Krishna Emotional Maternity Vlog Went Viral On Social Media, Watch Video Inside | Sakshi
Sakshi News home page

డెలివరీ ప్రాసెస్‌ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...

Jul 10 2025 4:24 PM | Updated on Jul 10 2025 5:54 PM

Actor and BJP leaders daughter goes viral for posting unfiltered maternity

మాతృత్వపు మధురిమ ఎవరికైనా అపురూపం. ఆ క్షణాలు కాబోయే తల్లులందరికీ భావోద్వేగభరితంగా ఉంటాయి. క్షణం క్షణం ఉత్కంఠ.. ఒకపక్క భరించలేని ప్రసవ వేదన..మరోవైపు వచ్చే బుడతడు కోసం ఆస్పత్రి బయట బంధువుల పడిగాపులు..అదంతా ఓ అపురూపమైన క్షణం. మర్చిపోలేని ప్రసవానుభవం కూడా. అలాంటి మధుర క్షణాలను చాలా రియలిస్టిక్‌గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్‌ని త్వరగా చదివేయండి మరీ..

మలయాళ నటుడు, బిజేపీ నాయకుడు కృష్ణ కుమార్‌ కుమార్తె దియా కృష్ణ నెట్టింట తన ప్రసవ అనుభవానికి సంబంధించిన వీడియోని షేర్‌ చేసుకున్నారు. అది కేవలం డెలివరీ సమయంలోని పరిస్థితులు కాదు..మొత్తం ఆస్పత్రిలో జాయిన్‌ అయినప్పటి నుంచి నొప్పులు మొదలు..బిడ్డను కని డిశ్చార్జ్‌ అయ్యి వచ్చే వరకు మొత్తం తతంగాన్ని ఆమె చాలా చక్కగా రికార్డు చేశారు. 

ప్రతి దృశ్యం కదిలించేలా ఉంటుంది. ప్రసవ సమయంలో ఇలా ఉంటుందా అనే ఫీల్‌ని తెప్పిస్తుంది. ఇక్కడ దియా డెలివెరికి వెళ్లే క్షణంలో అందంగా మేకప్‌ వేసుకుని మరీ వెళ్తుంది. ఎందుకంటే మొటిమలతో ఉన్న ముఖంతో నా బిడ్డకు స్వాగతించడం ఇష్టం లేదంటూ చెప్పడం వీడియోలో చూడొచ్చు. అయితే ఆమె మొటిమలు చెడ్డవి కావు గానీ..నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకే ఇలా అని చెబుతుంది వీడియోలో. 

ఆ వీడియోలో భర్త, ఆమె తల్లిదండ్రులు ప్రసవ వేదన సమయంలో ఓదార్చడం, వైద్య సిబ్బంది మద్దతు తదితర దృశ్యాలన్ని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. చివర్లో ఆమె చేతుల్లో బిడ్డను పెట్టే అపురూపమైన క్షణం అత్యంత అద్భుతంగా ఉంటుంది. దియా ఇందులో ఆధునిక వైద్య విధానం ఎలా ఉందో తెలియజేసేందుకే ఇదంతా షూట్‌ చేసినట్లు చెప్పుకొచ్చారామె. 

ఇక ఇక్కడ దియాకి సుఖ ప్రసవం అయ్యింది. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఈ వీడియో క్లిప్‌ షేర్‌ చేసిన మూడు రోజుల్లోనే ఆరు మిలయన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. కాగా, నెటిజన్లు మాత్రం అందరిలా కాకుండా ప్రతీది రియలిస్టిక్‌గా ప్రసవ సమయంలో ఉండే ఉద్విగ్న స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారని ఆమెని ప్రశంసించగా, మరికొందరు మాత్రం ఇలాంటివి ఎందుకు చిత్రీకరిస్తారని మండిపడుతూ పోస్టులు పెట్టారు.   

(చదవండి: 71 ఏళ్ల వయసులో సీఏ అయ్యాడు..! మనవరాలి కోసం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement