
విద్యకు బ్రేక్ అనేది ఉండదు. చదవాలన్నా కోరిక బలంగా ఉంటే చాలు వయసు పెద్ద మేటర్ కాదని గతంలో చాలామంది ప్రూవ్ చేశారు. వాళ్లంతా ఏవో కారణాలతో చదువుకోలేకపోతే..ఆయా కోర్సులను పూర్తి చేసి తమ డ్రిమ్‌ని నిజం చేసుకున్నారు. ఈ తాతయ్య అలాకాదు ఏకంగా అత్యంత కఠినతరమైన సీఏని 71 ఏళ్ల వయసులో పూర్తి చేసి శెభాష్ అనిపించుకున్నాడు. అదికూడా మనవరాలి కారణంగా ఈ ఘనత సాధించాడు ఈ తాతయ్య. స్ఫూర్తిదాయకమైన అతడి స్టోరి ఏంటో చూద్దామా..!.
ఆయనే తారా చంద్ అగర్వాల్. ఆ తాతయ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (SBBJ) మాజీ ఉద్యోగి. రిటైర్డ్ వయసులో అందరిలో రెస్ట్ తీసుకోకుండా, ప్రతిష్టాత్మకమైన సీఏ పరీక్షలు రాయాలనుకోవడం విశేషం. ఆ వయసులో ఏ పుణ్య క్షేత్రాలు, లేదా మనవరాళ్లు, మనవళ్లతో కాలక్షేపం చేస్తారు. కానీ ఈయన అలా కాదు. ఆ విశ్రాంతి సమయంలో తన డ్రీమ్ నెరవేర్చుకుని స్ఫూర్తిగా నిలిచాడు.
నిజానికి ఆయన ఈ ఎగ్జామ్ రాయడానికి కారణం తన మనవరాలేనట. ఆమె సీఏ చదువు కోసం సహాయం చేసేవారట. ఆమెకు అకౌంట్స్‌పై ఉండే సందేహాలను తీరుస్తూ..తెలియకుండానే ఆ సబ్జెక్టుపై ఆసక్తి పెరిగిందట. అలా ఆ జిజ్ఞాస కాస్తా విద్యా వృత్తిగా మారి చివరకు సీఏ పరిక్షలకు ప్రిపేరవ్వాలనే సంకల్పానికి దారితీసింది. ఆ విధంగా ఆయన సీఏ అయ్యాడు.
ఈ ఏడాది జులై6న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసిన చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫైనల్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో తారా చంద్ వజయవంతం గాపూర్తి చేసి..అందరిని ఆశ్చర్యపరిచాడు. పైగా యువతకు ఆదర్శంగా నిలిచారాయన. చార్టర్డ్ అకౌంటెంట్ నిఖిలేష్ కటారియా స్ఫూర్తిదాయకమైన కథను లింక్డ్‌ఇన్‌లో పంచుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఈ ఏడాది సీఏలో మొత్తం 14,247 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఐసీఏఐ వెల్లడించింది.
(చదవండి: డిటాక్స్..రిలాక్స్..! కాసేపు టెక్నాలజీకి బ్రేక్ ఇద్దామా..!)