ఆ శకం ముగిసింది : రూ. 183 కోట్ల డీల్‌, రూ. 3వేల కోట్ల లగ్జరీ ప్రాజెక్ట్‌ | Kajol and Rani Mukerji grandfather Iconic studio be turned luxury apartments | Sakshi
Sakshi News home page

ఆ శకం ముగిసింది : రూ. 183 కోట్ల డీల్‌, రూ. 3వేల కోట్ల లగ్జరీ ప్రాజెక్ట్‌

Jul 10 2025 4:09 PM | Updated on Jul 10 2025 5:24 PM

Kajol and Rani Mukerji grandfather Iconic studio be turned luxury apartments

 ఐకానిక్‌ స్టూడియో శకానికి ముగింపు 

బాలీవుడ్ స్వర్ణయుగం ‘ఫిల్మిస్తాన్‌ స్టూడియో’  ఇక జ్ఞాపకంగా మిగలబోతోంది

కాజోల్, రాణి ముఖర్జీల తాత,  శషధర్ ముఖర్జీ స్థాపించిన ఫిల్మిస్తాన్‌  

బాలీవుడ్‌లో 100 ఏళ్లకు పైగా చరిత్ర, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన  ఒక ఐకానిక్‌ స్టూడియో  శకం ముగియనుంది. 1943లో శషధర్ ముఖర్జీ స్థాపించిన ఫిల్మిస్తాన్ స్టూడియోస్‌ (Filmistan Studios)  ఇపుడిక కమర్షియల్‌ రియల్‌  ఎస్టేట్‌ ప్రాపర్టీగా మారబోతోంది.  దీన్ని ఆర్కేడ్ డెవలపర్స్ జూలై 3న రూ. 183 కోట్లకు కొనుగోలు చేసిందని టైమ్స్ నౌ డిజిటల్ నివేదించింది. ఈ మార్పు బాలీవుడ్ స్వర్ణయుగానికి మూలస్తంభం, ఐకానిక్ స్టూడియో శకం ముగింపును సూచిస్తుందని  పలువురి సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఏర్పడిన స్టూడియోలలో ఒకటి  ఫిల్మిస్తాన్ స్టూడియో. దీన్ని ఏర్పాటు చేసిన శశధర్ ముఖర్జీ  మరోవ్వరో కాదు బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, రాణి ముఖర్జీల తాత.  ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లో ఉన్న ఈ స్టూడియోను నటుడు అశోక్ కుమార్, జ్ఞాన్ ముఖర్జీ , రాయ్ బహదూర్ చునిలాల్ వంటి దిగ్గజ వ్యక్తులతో కలిసి స్థాపించారు. బాంబే టాకీస్‌ను విడిచిపెట్టిన వీరంతా హైదరాబాద్ నిజాం సహాయంతో దీన్నిస్థాపించారు.  అప్పటినుంచి అనేక ప్రతిష్టాత్మక సినిమాలకువేదికైంది. 

ఎకనామిక్ టైమ్స్‌ ఒక నివేదిక ప్రకారం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్ దీన్ని కొనుగోలు చేసింది. 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టూడియో స్థానంలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తోంది. 2026లో  షురూ కానున్నఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రీమియం 3, 4 , 5 BHK అపార్ట్‌మెంట్‌లతో కూడిన రెండు ఎత్తైన 50-అంతస్తుల భవనాల సముదాయంగా నిర్మించనుంది. ఆర్కేడ్ డెవలపర్స్ ఛైర్మ, ఎండీ అమిత్ జైన్ లింక్డ్‌ఇన్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు. పట్టణ,విలాసవంతమైన జీవనానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ ఉండబోతోందని ఆయన  పేర్కొన్నారు.

చదవండి: Akhil Anand చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ కుమారుడు 14 ఏళ్లకే!

మరోవైపు ఫిల్మిస్తాన్ స్టూడియోను విక్రయంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేష్ ((AICWA) స్పందించింది.   ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది కార్మికులు,కార్మికులు, కళాకారులు  రోడ్డున పడతారని  వాదిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జోక్యం చేసుకుని స్టూడియో కూల్చివేతను ఆపాలని కోరింది.ఈ స్టూడియో కేవలం ఒక నిర్మాణ మైలురాయి మాత్రమే కాదు, వేలాది మంది తెరవెనుక నిపుణుల అవిశ్రాంత అంకితభావంపై నిర్మించిన గొప్ప సాంస్కృతిక వారసత్వ వేదిక అని  పేర్కొంది.  ఇలాంటి అనేక ఇతర చారిత్రాత్మక చలనచిత్ర స్టూడియోలు ఇదే  దశలో ఉన్నాయనీ, వినోద రంగంలో ఉపాధికి విస్తృత ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ  అసోసియేషన్‌ నేతలు సీఎంకు ఒక లేఖ రాశారు. 

ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement