breaking news
Iconic place
-
ఆ శకం ముగిసింది : రూ. 183 కోట్ల డీల్, రూ. 3వేల కోట్ల లగ్జరీ ప్రాజెక్ట్
బాలీవుడ్లో 100 ఏళ్లకు పైగా చరిత్ర, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన ఒక ఐకానిక్ స్టూడియో శకం ముగియనుంది. 1943లో శషధర్ ముఖర్జీ స్థాపించిన ఫిల్మిస్తాన్ స్టూడియోస్ (Filmistan Studios) ఇపుడిక కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మారబోతోంది. దీన్ని ఆర్కేడ్ డెవలపర్స్ జూలై 3న రూ. 183 కోట్లకు కొనుగోలు చేసిందని టైమ్స్ నౌ డిజిటల్ నివేదించింది. ఈ మార్పు బాలీవుడ్ స్వర్ణయుగానికి మూలస్తంభం, ఐకానిక్ స్టూడియో శకం ముగింపును సూచిస్తుందని పలువురి సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఏర్పడిన స్టూడియోలలో ఒకటి ఫిల్మిస్తాన్ స్టూడియో. దీన్ని ఏర్పాటు చేసిన శశధర్ ముఖర్జీ మరోవ్వరో కాదు బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, రాణి ముఖర్జీల తాత. ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లో ఉన్న ఈ స్టూడియోను నటుడు అశోక్ కుమార్, జ్ఞాన్ ముఖర్జీ , రాయ్ బహదూర్ చునిలాల్ వంటి దిగ్గజ వ్యక్తులతో కలిసి స్థాపించారు. బాంబే టాకీస్‌ను విడిచిపెట్టిన వీరంతా హైదరాబాద్ నిజాం సహాయంతో దీన్నిస్థాపించారు. అప్పటినుంచి అనేక ప్రతిష్టాత్మక సినిమాలకువేదికైంది. ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదిక ప్రకారం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్ దీన్ని కొనుగోలు చేసింది. 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టూడియో స్థానంలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తోంది. 2026లో షురూ కానున్నఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రీమియం 3, 4 , 5 BHK అపార్ట్మెంట్లతో కూడిన రెండు ఎత్తైన 50-అంతస్తుల భవనాల సముదాయంగా నిర్మించనుంది. ఆర్కేడ్ డెవలపర్స్ ఛైర్మ, ఎండీ అమిత్ జైన్ లింక్డ్ఇన్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. పట్టణ,విలాసవంతమైన జీవనానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు.చదవండి: Akhil Anand చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు 14 ఏళ్లకే!మరోవైపు ఫిల్మిస్తాన్ స్టూడియోను విక్రయంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేష్ ((AICWA) స్పందించింది. ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది కార్మికులు,కార్మికులు, కళాకారులు రోడ్డున పడతారని వాదిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జోక్యం చేసుకుని స్టూడియో కూల్చివేతను ఆపాలని కోరింది.ఈ స్టూడియో కేవలం ఒక నిర్మాణ మైలురాయి మాత్రమే కాదు, వేలాది మంది తెరవెనుక నిపుణుల అవిశ్రాంత అంకితభావంపై నిర్మించిన గొప్ప సాంస్కృతిక వారసత్వ వేదిక అని పేర్కొంది. ఇలాంటి అనేక ఇతర చారిత్రాత్మక చలనచిత్ర స్టూడియోలు ఇదే దశలో ఉన్నాయనీ, వినోద రంగంలో ఉపాధికి విస్తృత ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ అసోసియేషన్ నేతలు సీఎంకు ఒక లేఖ రాశారు. ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! -
సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు విస్తరించే దిశగా ఆతిథ్య సేవల ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఎయిర్‌బీఎన్‌బీ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్ తదితర రంగాల సెలబ్రిటీలతో జట్టు కడుతోంది. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌తో చేతులు కలిపింది. ’భారత్‌లో బాలీవుడ్ స్టార్ జాన్వి కపూర్‌లా జీవించండి’ స్లోగన్‌తో ఆమె బాల్యంలో నివసించిన చెన్నై ఇంటిని బస కోసం ప్రమోట్ చేస్తోంది. తమ కార్యకలాపాలకు సంబంధించి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని, టాప్ 10 మార్కెట్ల జాబితాలోకి చేరే అవకాశాలు ఉన్నాయని ఎయిర్‌బీఎన్‌బీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డేవ్ స్టీఫెన్సన్ తెలిపారు. 2022తో పోలిస్తే 2023లో బుకింగ్స్ 30 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. విదేశాలు వెళ్లేవారితో పాటు దేశీయంగా కూడా పర్యటించే టూరిస్టులను ఆకట్టుకునేందుకు భారత్‌లో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్టీఫెన్సన్ వివరించారు. తమ కార్యకలాపాల ద్వారా భారత్‌లో 85,000 పైచిలుకు ఉద్యోగాలకు, జీడీ పీ వృద్ధికి 920 మిలియన్ డాలర్ల మేర తోడ్పా టు అందించినట్లు పేర్కొన్నారు. -
లెజెండ్రీ యాక్టర్ ఐకానిక్ బంగ్లా, గోద్రెజ్ ప్రాపర్టీస్ చేతికి: రణధీర్ భావోద్వేగం
సాక్షి, ముంబై: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ ముంబై బంగ్లాను దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ గోద్రెజ్ ప్రాపర్టీస్ సొంతం చేసుకుంది. విలాసవంతమైన హౌసింగ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి ముంబైలోని చెంబూర్‌లో ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత రాజ్‌కపూర్ బంగ్లాను కొనుగోలు చేసినట్లు గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. కపూర్ కుటుంబానికి చెందిన వారసులనుంచి చట్టబద్ధంగా ఈ బంగ్లాను కొనుగోలు చేసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇది ముంబైలోని చెంబూర్‌లోని డియోనార్ ఫామ్ రోడ్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రక్కనే ఈ బంగ్లా ఉంది. అయితే కొనుగోలు డీల్ విలువను వెల్లడించలేదు. ఈ ఐకానిక్ ప్రాజెక్ట్‌ను తమ పోర్ట్‌ఫోలియోకు జోడించడం సంతోషంగా ఉందని,ఈ అవకాశం ఇచ్చిన కపూర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు గోద్రెజ్ ప్రాపర్టీస్ సీఎండీ గౌరవ్ పాండే. ఈ ప్రాజెక్ట్ చెంబూర్‌లో తమ ఉనికిని మరింత బలోపేతం చేయనుందని పాండే చెప్పారు. గతకొన్నేళ్లుగా ప్రీమియం డెవలప్మెంట్లకు డిమాండ్ బలంగా ఉందన్నారు. ఈ ఐకానిక్ ప్రాపర్టీకి తమ కుటుంబానికీ మధ్య సంబంధం కేవలం భావోద్వేగమైంది మాత్రమే కాదు చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉందని రణధీర్‌కపూర్ ఉద్వేగానికి లోనయ్యారు. గోద్రెజ్ గ్రూప్‌లో భాగస్వామ్యంపై ఆయన సంతోషం ప్రకటించారు. 2019, మేలో ప్రీమియం మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఆర్కెఎస్ను అభివృద్ధి చేయడానికి కపూర్ కుటుంబం నుండి చెంబూర్‌లోని ఆర్కె స్టూడియోస్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం డెలివరీ కానుందని అంచనా. ఆర్కే బంగ్లా లేదా కృష్ణరాజ్ బంగ్లా 76 సంవత్సరాల క్రితం 1946లో ఆర్కే కాటేజీగా నిర్మించారు బాలీవుడ్ హీరో రాజ్ కపూర్ . ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో కొలువుదీరిన ఈ అందమైన భవనం ఆర్కే బంగ్లా (కృష్ణ రాజ్ బంగ్లా) కొన్ని దశాబ్దాలుగా పాపులర్ అయింది. అయితే రిషి కపూర్ , నీతూ వివాహం సందర్భంగా ఈ బంగ్లా పేరును 'కృష్ణ రాజ్ బంగ్లా'గా మార్చారట. దాదాపు 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాలో రాజ్ కపూర్, భార్య కృష్ణ కపూర్, పిల్లలందరూ నివసించారు. రాజ్ కపూర్ పిల్లలు రిషి కపూర్, రణధీర్, రాజీవ్ కపూర్ ఈ బంగ్లాలో వివాహం చేసుకున్నారు. గత 76 ఏళ్లుగా, కపూర్ కుటుంబంలోని వివాహాలు, పెద్ద పెద్ద ఈవెంట్లకు ఈ బంగ్లానే వేదిక కావడం విశేషం. -
ఐకానిక్ స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు
సాక్షి, ముంబై: ముంబైలోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (జీపీఎల్) గత ఏడాది కొనుగోలు చేసిన ఐకానిక్ ఆర్కే స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలను ప్రారంభించినట్టు శుక్రవారం తెలిపింది. 'కలెక్టర్ ఎడిషన్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ సముదాయంలో బొంబాయి ఆర్ట్ డెకో డిజైన్ తరహాలో ఆర్కిటెక్చర్, అత్యాధునిక, విలాసవంతమైనసౌకర్యాలు, అత్యంత కట్టుదిట్ట మైన సెక్యూరిటీ ఫీచర్లు ఈ ఫ్లాట్లలో కల్పించనున్నామని జీపీఎల్ ప్రకటించింది. ఈ మేరకు గోద్రెజ్ పాపర్టీస్ తన అధికారిక వెబ్సైట్లో వివరాలను పొందుపర్చింది. 3, 4 పడక గదుల లగ్జరీ ఫ్లాట్లకోసం ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది. 3 బెడ్ రూమ్ ఫ్లాట్ ధర రూ. 5.7 కోట్ల నుంచి, 4 బెడ్రూమ్ ఫ్లాట్ ధర రూ.10.9 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెబ్సైట్ తెలిపింది. చెంబూర్‌లోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో గోద్రేజ్ ఆర్కెఎస్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని గోద్రేజ్ ప్రాపర్టీస్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోఝా గోద్రేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. విశేషమైన వారసత్వాన్ని, అత్యుత్తమ జీవనశైలిని ఈ ప్రాంగణంలో నివసించబోయేవారికి అందించేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతామన్నారు. కాగా 72 సంవత్సరాల క్రితం, ప్రముఖ బాలీవుడ్ నటుటు రాజ్ కపూర్ ఆర్కే ఫిల్మ్ స్టూడియోను 2.2 ఎకరాల్లో స్థాపించారు. ఎన్నో భారీ చిత్రాలు ఈ స్టూడియోలోనే రూపుదిద్దుకున్నాయి. ఈ స్టూడియోను విక్రయించాలని నిర్ణయించుకున్న కపూర్ కుటుంబం గత ఏడాది జీపీఎల్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. -
108 ఏళ్ల హోటల్..నాలుగేళ్ల తర్వాత..
పారిస్ : పారిస్‌లో చరిత్రాత్మక 108 ఏళ్ల పురాతన లగ్జరీ హోటల్ లుటెటియా నాలుగేళ్ల పాటు సాగిన మేకోవర్ అనంతరం తిరిగి ప్రారంభం కానుంది. 200 మిలియన్ల యూరోల ఖర్చుతో ఈ హోటల్ ఆధునిక కస్టమర్లకు ఆతిథ్యమిచ్చేందుకు అత్యాధునిక హంగులతో సిద్ధమైంది. పికాసో, హెన్రీ మాటిస్ వంటి సుప్రసిద్ధ ఆర్టిస్టులు సహా ఎందరో దిగ్గజాలు ఈ హోటల్లో సేదతీరిన వారే. నూతన హంగులతో ముందుకొచ్చిన ఈ ఐదు నక్షత్రాల హోటల్ ఈనెల 12 నుంచి పునఃప్రారంభమవుతందని హోటల్ ప్రతినిధి చెప్పారు. ఈ లగ్జరీ హోటల్లో స్పా, ఇండోర్ పూల్, జాజ్ బార్ వంటి సౌకర్యాలున్నాయని తెలిపారు.ఈ చారిత్రక హోటల్ అత్యాధునిక సౌకర్యాలతో గతంలో మాదిరే కస్టమర్లను ఆకట్టుకుంటుందని లుటెటియా హోటల్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. కాగా 2015 నవంబర్‌లో పారిస్ హోటల్లో జరిగిన భీకర దాడిలో 130 మంది మృత్యువాత పడినప్పటి నుంచి లగ్జరీ హోటళ్లలో ఆక్యుపెన్సీ రేట్ 52 శాతం నుంచి 15 శాతానికి దిగజారింది. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ హోటల్ వినియోగదారులను తనదైన రాజసం, చారిత్రక విలువలతో ఆకట్టుకుంటుందని లుటెటియా ప్రతినిధి చెప్పుకొచ్చారు. -
450 కోట్లతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ధి
హైదరాబాద్: దేశంలో ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను స్వచ్ఛ ఐకానిక్ స్థలాలుగా గుర్తించి వాటిని రూ.450 కోట్ల వ్యయంతో పర్యాటక అనుకూల ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ శాఖ డైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సును జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మూడో దశ స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాలను ప్రకటించారు. ఇందులో కణ్వాశ్రమ్ (ఉత్తరాఖండ్), బ్రహ్మసరోవర్ టెంపుల్(హరియాణా), శ్రీనాగ్వాసుకి ఆలయం (ఉత్తరప్రదేశ్), శబరిమల శ్రీధర్మసస్థ టెంపుల్ (కేరళ), శ్రీరాఘవేంద్రస్వామి మంత్రాలయం (ఆంధ్రప్రదేశ్), పాంగోంగ్‌త్సో(జమ్మూ కశ్మీర్), మన విలేజ్ (ఉత్తరాఖండ్), విదుర్కుటి టెంపుల్ (ఉత్తరప్రదేశ్), ఎమాకైథెల్ (మణిపూర్), హజార్ దువారి ప్యాలెస్ (పశ్చిమబెంగాల్)ఉన్నాయి. ఈసారి తెలంగాణ నుంచి ఏ ప్రాంతం ఎంపిక కాలేదు. మొత్తం మూడు దశల్లో 30 ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఐకానిక్ ప్రాంతాలుగా గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో కార్పొరేట్ సంస్థకు అప్పగించామని ఈ సందర్భంగా అక్షయ్ రౌత్ తెలిపారు. చార్మినార్‌లో భారీ పాదచారుల ప్రాజెక్టు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ చార్మినార్ పరిసర ప్రాం తాల అభివృద్ధికి అతిపెద్ద పాదచారుల ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. చార్మినార్ వద్ద నిత్యం శానిటేషన్ చేపట్టామన్నారు. కార్పొరేట్ సంస్థల నిధుల విడుదలలో మరింత సరళీకృతంగా ఉండాలని తెలిపారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.35.10 కోట్ల జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. స్వచ్ఛ ఐకానిక్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
ఇక ‘ఐకానిక్’ చార్మినార్!
స్వచ్ఛభారత్ మిషన్ కింద మరో 10 స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాలను ప్రకటించిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్‌ను స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా గుర్తించి ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ‘స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనీషియేటివ్’రెండో దశలో భాగంగా చార్మినార్‌తో పాటు 10 ప్రదేశాలను ప్రకటించింది. మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర తాగు నీరు, పరిశుభ్రత శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రదేశాల్లో ఉన్నత స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడంతో పాటు సందర్శకులకు సౌకర్యాలు కల్పిస్తారు. చార్మినార్‌తో పాటు గంగోత్రి, యమునోత్రి, ఉజ్జయినీలోని మహా కాళేశ్వర్ మందిర్, గోవాలోని చర్చ్ అండ్ కాన్వెంట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసైసీ, ఎర్నాకు లంలోని ఆదిశంకరాచార్య, శ్రావణ బెలగోలాలోని గోమఠేశ్వర్, దేవగర్‌లోని బైజ్నాథ్ ధామ్, బిహార్‌లోని తీర్థగయా, గుజరాత్‌లోని సోమ్‌నాథ్ దేవాలయాలను రెండో దశలో ఐకానిక్ ప్రదేశాలుగా ప్రకటించారు. ఇప్పటికే మొదటి దశలో ఏపీలోని తిరుమల దేవాల యం, తిరుపతి, అజ్మీర్ షరీఫ్ దర్గా, సీఎస్టీ ముంబై, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, అసోంలోని కామాఖ్య దేవాలయం, వారణాసిలోని మణికర్నిక ఘాట్, మదురైలోని మీనాక్షి దేవాలయం, జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయం, పూరిలోని జగన్నాథ్ దేవాలయం, ఆగ్రాలోని తాజ్‌మహల్‌లను ఐకానిక్ ప్రదేశాలుగా గుర్తించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద దేశంలోని 100 ప్రసిద్ధ, వారసత్వ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాల్లో పరిశుభ్రతపై కేంద్రం దృష్టి సారించిన విషయం తెలిసిందే.