ఐకానిక్‌ స్టూడియోలో అమ్మకానికి లగ్జరీ ఫ్లాట్లు

Luxury flats up for sale at Mumbai's iconic RK Studios - Sakshi

సాక్షి, ముంబై: ముంబైలోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు అమ్మకానికి  సిద్ధంగా ఉన్నాయి. ముంబైకి చెందిన  ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (జీపీఎల్) గత ఏడాది కొనుగోలు చేసిన ఐకానిక్ ఆర్కే స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలను ప్రారంభించినట్టు శుక్రవారం తెలిపింది.

'కలెక్టర్ ఎడిషన్ రెసిడెన్సెస్'  పేరుతో నిర్మిస్తున్న ఈ సముదాయంలో బొంబాయి ఆర్ట్ డెకో డిజైన్ తరహాలో ఆర్కిటెక్చర్‌, అత్యాధునిక,  విలాసవంతమైనసౌకర్యాలు, అత్యంత కట్టుదిట్ట మైన సెక్యూరిటీ ఫీచర్లు ఈ ఫ్లాట్లలో కల్పించనున్నామని జీపీఎల్‌  ప్రకటించింది. ఈ మేరకు గోద్రెజ్‌ పాపర్టీస్‌  తన అధికారిక వెబ్‌సైట్‌లో  వివరాలను పొందుపర్చింది. 3, 4  పడక గదుల లగ్జరీ ఫ్లాట్లకోసం ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది. 3 బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ ధర రూ. 5.7 కోట్ల నుంచి, 4 బెడ్‌రూమ్ ఫ్లాట్ ధర రూ.10.9 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెబ్‌సైట్ తెలిపింది. చెంబూర్‌లోని ఐకానిక్ ఆర్‌కె స్టూడియోలో గోద్రేజ్ ఆర్కెఎస్‌ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని గోద్రేజ్ ప్రాపర్టీస్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోఝా గోద్రేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. విశేషమైన వారసత్వాన్ని, అత్యుత్తమ జీవనశైలిని ఈ ప్రాంగణంలో నివసించబోయేవారికి అందించేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతామన్నారు.  

కాగా 72 సంవత్సరాల క్రితం, ప్రముఖ బాలీవుడ్‌ నటుటు రాజ్‌ కపూర్‌  ఆర్‌కే ఫిల్మ్ స్టూడియోను 2.2 ఎకరాల్లో స్థాపించారు. ఎన్నో భారీ చిత్రాలు ఈ స్టూడియోలోనే రూపుదిద్దుకున్నాయి. ఈ స్టూడియోను విక్రయించాలని నిర్ణయించుకున్న కపూర్‌ కుటుంబం గత ఏడాది  జీపీఎల్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top