ప్రముఖ ఈ కామర్స్ అగ్ర సంస్థ అమెజాన్ రిపబ్లిక్ డే బిగ్ సేల్‌కు సిద్ధమైంది. ఈ మేరకు సేల్ ప్రారంభం తేదీని ప్రకటించింది. జనవరి 16న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్-2026 ప్రారంభం కానుందని వెల్లడించింది. ఈ బిగ్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ ప్రకటన విడుదల చేసింది.
త్వరలోనే ప్రాడక్ట్స్‌పై అందించే డీల్స్ వివరాలను వెల్లడిస్తామని అమెజాన్ పేర్కొంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, గేమింగ్ కన్సోల్, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషిన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్‌టీవీలపై ఆఫర్లు ఉంటాయని తెలిపింది. అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ జనవరి 17న సేల్‌ను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పండగ సీజన్‌లో రెండు అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థల మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది.


