breaking news
Godrej Properties Company
-
ఐకానిక్ స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు
సాక్షి, ముంబై: ముంబైలోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (జీపీఎల్) గత ఏడాది కొనుగోలు చేసిన ఐకానిక్ ఆర్కే స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలను ప్రారంభించినట్టు శుక్రవారం తెలిపింది. 'కలెక్టర్ ఎడిషన్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ సముదాయంలో బొంబాయి ఆర్ట్ డెకో డిజైన్ తరహాలో ఆర్కిటెక్చర్, అత్యాధునిక, విలాసవంతమైనసౌకర్యాలు, అత్యంత కట్టుదిట్ట మైన సెక్యూరిటీ ఫీచర్లు ఈ ఫ్లాట్లలో కల్పించనున్నామని జీపీఎల్ ప్రకటించింది. ఈ మేరకు గోద్రెజ్ పాపర్టీస్ తన అధికారిక వెబ్సైట్లో వివరాలను పొందుపర్చింది. 3, 4 పడక గదుల లగ్జరీ ఫ్లాట్లకోసం ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది. 3 బెడ్ రూమ్ ఫ్లాట్ ధర రూ. 5.7 కోట్ల నుంచి, 4 బెడ్రూమ్ ఫ్లాట్ ధర రూ.10.9 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెబ్సైట్ తెలిపింది. చెంబూర్‌లోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో గోద్రేజ్ ఆర్కెఎస్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని గోద్రేజ్ ప్రాపర్టీస్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోఝా గోద్రేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. విశేషమైన వారసత్వాన్ని, అత్యుత్తమ జీవనశైలిని ఈ ప్రాంగణంలో నివసించబోయేవారికి అందించేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతామన్నారు. కాగా 72 సంవత్సరాల క్రితం, ప్రముఖ బాలీవుడ్ నటుటు రాజ్ కపూర్ ఆర్కే ఫిల్మ్ స్టూడియోను 2.2 ఎకరాల్లో స్థాపించారు. ఎన్నో భారీ చిత్రాలు ఈ స్టూడియోలోనే రూపుదిద్దుకున్నాయి. ఈ స్టూడియోను విక్రయించాలని నిర్ణయించుకున్న కపూర్ కుటుంబం గత ఏడాది జీపీఎల్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. -
గోద్రేజ్ బీకేసీ ప్రాజెక్టును కొనుగోలు చేసిన అబాట్
డీల్ విలువ రూ.1,480 కోట్లు అతి పెద్ద రియల్టీ లావాదేవీల్లో ఒకటి న్యూఢిల్లీ: గోద్రేజ్ ప్రొపర్టీస్ సంస్థ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీలో)ని 4.35 లక్షల చదరపుటడుగుల కమర్షియల్ ప్రాజెక్ట్‌ను ఫార్మా దిగ్గజం అబాట్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ.1,480 కోట్లు. భారత్‌కు సంబంధించి అతి పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్‌లో ఇదొకటి. ముంబైలో ఉన్న తన వ్యాపారాన్నంతటినీ ఒకే ప్రాంతానికి తరలించే వ్యూహంలో భాగంగా అబాట్ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేసింది. ఇక్కడ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాలు చేయాలని అబాట్ యోచిస్తోంది. కాగా ఈ నిధులతో కంపెనీ రుణ భారాన్ని తగ్గించుకుంటామని, భవిష్యత్ వృద్ధికి వినియోగించుకుంటామని గోద్రేజ్ ప్రొపర్టీస్ ఎండీ, సీఈఓ పిరోజ్షా గోద్రేజ్ చెప్పారు. ఇంకా ఈ ప్రాజెక్టులో తమకు 3 లక్షల చదరపుటడుగుల స్పేస్ ఉందని, త్వరలో ఈ స్పేస్‌ను కూడా విక్రయిస్తామని వివరించారు. జెట్ ఎయిర్‌వేస్‌తో కలిసి గోద్రేజ్ సంస్థ బీకేసీని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కార్యకలాపాలను లార్సెన్ అండ్ టుబ్రో చూస్తోంది. ఈ ఏడాది మార్చినాటికి గోద్రేజ్ ప్రొపర్టీస్ రుణ భారం రూ.2,764 కోట్లుగా ఉంది.