గోద్రేజ్ బీకేసీ ప్రాజెక్టును కొనుగోలు చేసిన అబాట్ | Godrej Properties sells 435000 sq. ft BKC office space for Rs1,479 ... | Sakshi
Sakshi News home page

గోద్రేజ్ బీకేసీ ప్రాజెక్టును కొనుగోలు చేసిన అబాట్

Oct 1 2015 12:50 AM | Updated on Sep 3 2017 10:15 AM

గోద్రేజ్ బీకేసీ ప్రాజెక్టును కొనుగోలు చేసిన అబాట్

గోద్రేజ్ బీకేసీ ప్రాజెక్టును కొనుగోలు చేసిన అబాట్

గోద్రేజ్ ప్రొపర్టీస్ సంస్థ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీలో)ని 4.35 లక్షల చదరపుటడుగుల కమర్షియల్ ప్రాజెక్ట్‌ను ఫార్మా దిగ్గజం అబాట్‌కు విక్రయించింది.

డీల్ విలువ రూ.1,480 కోట్లు   అతి పెద్ద రియల్టీ లావాదేవీల్లో ఒకటి
న్యూఢిల్లీ: గోద్రేజ్ ప్రొపర్టీస్ సంస్థ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీలో)ని 4.35 లక్షల చదరపుటడుగుల కమర్షియల్ ప్రాజెక్ట్‌ను ఫార్మా దిగ్గజం అబాట్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ.1,480 కోట్లు. భారత్‌కు సంబంధించి అతి పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్‌లో ఇదొకటి. ముంబైలో ఉన్న తన వ్యాపారాన్నంతటినీ ఒకే  ప్రాంతానికి తరలించే వ్యూహంలో భాగంగా అబాట్ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేసింది.

ఇక్కడ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాలు చేయాలని అబాట్ యోచిస్తోంది. కాగా ఈ నిధులతో కంపెనీ రుణ భారాన్ని తగ్గించుకుంటామని, భవిష్యత్ వృద్ధికి వినియోగించుకుంటామని గోద్రేజ్ ప్రొపర్టీస్ ఎండీ, సీఈఓ పిరోజ్‌షా గోద్రేజ్ చెప్పారు. ఇంకా ఈ ప్రాజెక్టులో తమకు 3 లక్షల చదరపుటడుగుల స్పేస్ ఉందని, త్వరలో ఈ స్పేస్‌ను కూడా విక్రయిస్తామని వివరించారు. జెట్ ఎయిర్‌వేస్‌తో కలిసి గోద్రేజ్ సంస్థ బీకేసీని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కార్యకలాపాలను లార్సెన్ అండ్ టుబ్రో చూస్తోంది. ఈ ఏడాది మార్చినాటికి గోద్రేజ్ ప్రొపర్టీస్ రుణ భారం రూ.2,764 కోట్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement