
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కుమారుడు పద్నాలుగేళ్ల అఖిల్ ఆనంద్ ( Akhil Anand) గురించి తెలుసుకుంటే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది. ఏడేళ్ల వయసులోనే 2018లో, తన తండ్రి ఆనంద్ 49వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు కార్డు తయారు చేసిన ఔరా అనిపించుకున్న అఖిల్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకోబోతున్నాడు. యువ కళాకారుడిగా తొలి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్, మోర్ఫోజెనిసిస్‌తో అరంగేట్రం చేయబోతున్నాడు.
సోలో ఎగ్జిబిషన్ మోర్ఫోజెనిసిస్ (గణితం, పురాణాలు , ప్రకృతిని పొరల దృశ్య కథనాలలో మిళితంచేసే ఆర్ట్) తో తన కళాత్మక అరంగేట్రం చేయబోతున్నాడు.ఆగస్టు 1న చెన్నైలోని కల్పడ్రుమాలో తన తొలి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నాడు భారతదేశపు గొప్ప జానపద, గిరిజన కళా సంప్రదాయాల రూపాయల్లో, ముఖ్యంగా మధుబని ,గోండ్ చెరియాల్ వార్లి , కాళిఘాట్ - అఖిల్ పవిత్ర జ్యామితి , ఫైబొనాక్సీ ఇలా అద్భుతమైన శైలులతో ఆర్ట్ స్టోరీ ఆధారిత కళాఖండాలను ప్రదర్శించబోతున్నాడు.
దీనిపై అఖిల్ ఆనంద్ మాట్లాడుతూ తన రాబోయే ప్రదర్శన గురించి మాట్లాడుతూ, , "నేను ప్రపంచాన్ని ఎలా చూస్తానో వ్యక్తీకరించడానికి కళ సహాయపడుతుంది. నేను విభిన్న శైలులు మరియు ఆలోచనలతో పనిచేయడమంటే ఇష్టం. నేను సృష్టిస్తున్న వాటిని పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కళాభిమానులకు నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నాడు.
ఆగస్టు 1 నుంచి 7 వరకు ఈ ప్రదర్శన ఉండబోతోంది. తొమ్మిదేళ్ల వయస్సు నుండి కళాకారిణి డయానా సతీష్ వద్ద శిక్షణ పొందాడు అఖిల్. భారతదేశ వారసత్వ కళలను సంరక్షించడం, ప్రాచుర్యాన్నివ్వడం అతని కళాత్మక లక్ష్యం. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, డేవిడ్ అటెన్‌బరో, జేన్ గూడాల్ లాంటి ప్రముఖుల ప్రేరణతో విద్య- పర్యావరణ అవగాహన సాధనాలుగా తన కళను వినియోగించుకోవడం విశేషం.
అంతేకాదు అఖిల్ ఆనంద్ అఖిలిజమ్స్ అనే సంస్థ ఫౌండర్ కూడా. భారతీయ కళను ధరించగలిగే , బహుమతిగా ఇచ్చే రూపాలుగా మార్చే వేదిక. బ్లాక్ ప్రింటింగ్‌లో నాడీ సంబంధిత సవాళ్లతో బాధపడుతున్న వ్యక్తులకు మద్దతు ఇచ్చే ఫౌండేషన్ హస్తతో కలిసి, అఖిల్ క్రాఫ్ట్, సంరక్షణ , వ్యాపారాన్ని వారధిగా చేసే బెస్పోక్ దుస్తులను డిజైన్ చేస్తాడు. అలాగే ప్రకృతిలో గణిత నమూనాలను అన్వేషించే పుస్తకం ది హార్ట్ ఆఫ్ మ్యాథ్ రచయిత కూడా.