సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు రూ.10 రూపాయలు ఇవ్వలేదని తాతని మనవడు హత్య చేశాడు. హత్య చేసిన బాలుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. విజయవాడ కొత్తపేట పీఎస్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న వృద్ధుడ్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.
నగరంలో ఈ ఘటన కలకలం రేపింది. మృతుడు తాపీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆయన స్వస్థలం మంగళగిరి నుకలపేట కాగా ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడని పోలీసులు చెప్పారు.
మరో ఘటనలో బందరు లాకులు వద్ద అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందినవారు యాచకులుగా స్థానికులు చెబతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.


