సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. చంద్రబాబు నిర్ణయాన్ని జనం తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి వైఎస్ జగన్ బాసటగా నిలిచారు. ప్రైవేటీకరణ పేరుతో స్కాం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు.
గవర్నర్‌ని కలిసి కోటి 4 లక్షల 11,136 సంతకాల ప్రతులు అందజేత చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని వినతించారు. జగన్ రాకతో విజయవాడ రోడ్లు కిటకిటలాడాయి. అన్ని వర్గాల ప్రజల నుంచి వైఎస్ జగన్ పోరాటానికి మద్దతు లభించింది. కార్యక్రమం సక్సెస్ కావడం పార్టీ కేడర్‌కు ఫుల్ జోష్ ఇచ్చింది.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్‌కు నివేదించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని.. న్యాయ పోరాటం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం కూడా చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను (గురువారం డిసెంబర్ 18)న లోక్‌భవన్‌కు తరలించారు. గవర్నర్ కార్యాలయ అధికారులు కె.రఘు (డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్), ఎన్.వెంకటరామాంజనేయులు (ఏడీసీ) ఆ పత్రాలు పరిశీలించారు. వాటన్నింటినీ వైఎస్ జగన్ తన భేటీలో గవర్నర్‌కు చూపారు. తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలు దేరిన వైఎస్ జగన్ నేరుగా తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించి నివాళులర్పించారు.



