జయహో జగన్
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట కదిలిన జన చైతన్యం
కోటి సంతకాల ప్రతుల అందజేత కార్యక్రమానికి భారీగా తరలివెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
దారి పొడవునా మెడికల్ కళాశాలల
చంద్రబాబు ప్రభుత్వంలో వైద్య విద్య, వైద్యం పేదలకు దూరం కానుందంటూ నినాదాలు
ప్రత్తిపాడు నుంచి నేతలు, కార్యకర్తలు...
పొన్నూరు/తాడేపల్లి రూరల్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమంలో నిరంతరం పాల్గొని, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలకు అండగా ఉండటంలో పార్టీ నాయకులు ముందుండాలని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి నాలుగు లక్షల సంతకాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్న నేపథ్యంలో గురువారం జగనన్న వెంట నడిచేందుకు పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో పొన్నూరు మండల పార్టీ అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మౌలాలి, మండల వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడు రుద్రపాటి నాగేశ్వరరావు, మండల ప్రచార విభాగం అధ్యక్షుడు తురిమెళ్ళ రాజశేఖర్, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మరియరాణి, నాయకులు షేక్ నాజర్, డక్కుమల్ల రవి, షేక్ షరీఫ్, కాలింత సునీల్, పెరికల చైతన్య, దేవరకొండ గోపి, కాలింత రమేష్, పెదకాకాని చేబ్రోలు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తరలివచ్చిన మంగళగిరి నాయకులు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల వద్ద సంతకాలు సేకరించారు. గురువారం ఆ పత్రాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌కు అందజేసే కార్యక్రమానికి పిలుపునివ్వడంతో మంగళగిరి నియోజకవర్గంలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకుడు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, మంగళగిరి తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు నాలి వెంకట కృష్ణ, అమరా నాగయ్య, దుగ్గిరాల అధ్యక్షుడు శివగోపయ్యల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పాదయాత్రగా కార్యకర్తలతో వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి దొంతిరెడ్డి వేమారెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యతోపాటు వైద్యవిద్యను ఉచితంగా అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. కాసుల కోసమే చంద్రబాబు ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టిందని, ప్రైవేటు వ్యక్తులకు బహుమతిగా ఇచ్చినందుకు టీడీపీ నాయకులు భారీగా లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. సంబంధిత జీవోను పరిశీలిస్తే మెడికల్ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి సైతం రెండు సంవత్సరాలు జీతాలు ప్రభుత్వం ఇస్తుందని ఆయన అన్నారు. ప్రజల సొమ్ము చంద్రబాబు అనుయాయులకు ధారాదత్తం చేయడం దుర్మార్గమైన విషయమని అన్నారు. ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రాబోయే కాలంలో ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి, మంగళగిరి పట్టణ రూరల్, దుగ్గిరాల మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నేతలు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు
గుంటూరు రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాల పత్రాలను గవర్నర్‌కు అందజేసేందుకు నియోజకవర్గం నుంచి విజయవాడకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కార్యక్రమం అనంతరం అక్కడి స్వరాజ్ మైదాన్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో గురువారం బలసాని కిరణ్‌కుమార్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
జయహో జగన్


