ఎన్నికల్లో సీట్లు రిజర్వు చేయాలని ‘సుప్రీం’తీర్పు
తెలంగాణ, ఏపీలో అమలు చేయాల్సిందేనని స్పష్టికరణ
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మహిళా న్యాయ వాదులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ, ఏపీ బార్ కౌన్సిళ్లలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కచి్చతంగా అమలు చేయాల్సిందేనని తేలి్చచెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగి్చలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌లోనే ఈ రిజర్వేషన్ అంశాన్ని స్పష్టంగా పొందుపరచాలని కోర్టు ఆదేశించింది.
దేశవ్యాప్తంగా బార్ కౌన్సిళ్లలో మహిళలకు 1/3 వంతు ప్రాతినిధ్యం కోరుతూ న్యాయవాది యోగమయ, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 8న కోర్టు తీర్పునిచి్చంది. ఎన్నికల ప్రక్రియ మొదలుకాని చోట 30 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని సూచించింది. ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదని, కాబట్టి ఇక్కడ కూడా మహిళా రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరుతూ సునీత, సుభాíÙణి గుడిమల్ల సహా మరికొందరు మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. వారి పిటిషన్లను సీజేఐ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించి, పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది.
ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ..
విచారణ సందర్భంగా తెలంగాణలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని సీజేఐ ప్రశ్నించగా.. శుక్రవారమే వస్తుందని న్యాయవాదులు బదులిచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. ‘తెలంగాణ ఒక ప్రగతిశీల రాష్ట్రం. అక్కడ మహిళా రిజర్వేషన్ల అమలులో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఇవే ఆదేశాలు ఏపీకి కూడా వర్తిస్తాయని, గతంలో ఇచి్చన ఉత్తర్వులను సవరిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఎన్నికల్లో పోటీకి తగినంత మంది మహిళా న్యాయవాదులు లేకపోతే.. 20 శాతం సీట్లను పోటీకి కేటాయించి, మిగిలిన 10 శాతం సీట్లకు మహిళలను కో–ఆప్ట్ (నామినేట్) చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.


