నేటి నుంచి జాతీయ పుస్తక ప్రదర్శన | 38th National Book Fair in Hyderabad 2025 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జాతీయ పుస్తక ప్రదర్శన

Dec 19 2025 5:54 AM | Updated on Dec 19 2025 5:54 AM

38th National Book Fair in Hyderabad 2025

ప్రారంభించనున్న మంత్రి జూపల్లి 

ముస్తాబైన ఎన్టీఆర్‌ స్టేడియం  

అందెశ్రీ పుస్తక ప్రదర్శన ప్రాంగణంగా నామకరణం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ 38వ జాతీయ పుస్తక మహోత్సవానికి ఎన్టీఆర్‌ స్టేడియం ముస్తాబైంది. పదకొండు రో జుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నా యి. శుక్రవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం లక్షల మంది పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కవి అందెశ్రీ ప్రాంగణంగా నామకరణం చేశారు. సాంస్కృతిక వేదికకు అనిశెట్టి రజిత పేరు పెట్టారు.

అలాగే ఈ ఏడాది చనిపోయిన జర్నలిస్ట్‌ స్వేచ్ఛ పేరిట మీడియా స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరో వేదికకు రచయిత కొంపల్లి వెంకట్‌గౌడ్‌ పేరు పెట్టనున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో ఈసారి 365 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం 350 స్టాళ్లను ఏర్పాటు చేయగా ప్రచురణ సంస్థల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈసారి స్టాళ్ల సంఖ్యను పెంచామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో మీడియా కోసం 22 స్టాళ్లు, రచయితల కోసం 9 స్టాళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు.  

విద్యార్థులకు ఉచిత ప్రవేశం..: ప్రతీ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది. సాధారణ సందర్శకులకు రూ.10 ప్రవేశ రుసుము ఉంటుంది. కేజీ నుంచి పీజీ స్థాయి విద్యార్ధుల వరకు ఉచిత ప్రవేశ సదుపాయం కలి్పంచినట్లు బుక్‌ఫెయిర్‌ కమిటీ కార్యదర్శి వాసు తెలిపారు. గత సంవత్సరం సుమారు 12 లక్షల మంది సందర్శకులు పుస్తక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం సుమారు 15 లక్షల మందికి పైగా సందర్శించే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement