పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: డీజీపీగా బి.శివధర్‌రెడ్డి నియామకంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డికి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ పూర్తికాల డీజీపీని నియమించే ప్రక్రియను ప్రారంభించాలని సర్కార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామా జిక కార్యకర్త టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు. పార్టీ ఇన్ పర్సన్(పిటిషనర్) వాదనలు వినిపిస్తూ.. శాశ్వత నియామకం జరిగేలా చూడటానికి, డీజీపీ పదవీ విరమణకు కనీసం 3 నెలల ముందుగానే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ భర్తీకి ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో సర్కార్ విఫలమైందని, తద్వారా శాశ్వత నియా మక ప్రక్రియను పక్కన పెట్టిందన్నారు. అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. యూపీఎస్సీకి ఒక ప్యానెల్‌ను సమర్పించినట్లు తెలిపారు.
అయితే, కమిషన్ అనేక వివరణలు కోరిందని, ఈలోగా కొందరు అధికారుల పదవీ విరమణతో ఈ ప్రక్రియ మ రింత సంక్లిష్టంగా మారిందన్నారు. ప్రస్తుత కేసు లో కో–వారంటో (ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి అధికారాన్ని సవాల్ చేసే) రిట్ దాఖలు చేయలేరని చెప్పారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషనర్ భావిస్తే.. అక్కడే ధిక్కార కేసు దాఖలు చేయాలని నివేదించారు. న్యాయస్థాన ం ఆదేశాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కావాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరిస్తూ, విచారణ వాయిదా వేశారు.


