సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలతో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ, అనకాపల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడే పరిస్థితి ఉందన్నారు. భూ వివాదాలు, సివిల్ సెటిల్‌మెంట్లలో ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడం ప్రభుత్వం చేతకానితనం అంటూ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కలెక్టర్లు, ఎస్పీలకు క్లాస్ పీకడం వల్ల ప్రయోజనం ఉండదు. సామంత రాజుల్లా చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలకు క్లాస్ పీకి, యాక్షన్ తీసుకుంటేనే దారికి వస్తారు. ముందు ఎమ్మెల్యేలను కట్టడి చేయడంపై సీఎం, డిప్యూటీ సీఎం దృష్టి సారించాలి’’ అంటూ గుడివాడ అమర్‌నాథ్ హితవు పలికారు.


