సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో నన్నయ్య యూనివర్శిటీలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీలు తొలగించినవారి అంతుచూస్తామంటూ బెదిరింపులకు దిగారు. వీసీ ఆఫీసులో వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్యను వీసీ పీఏ నెట్టేశారని ఆరోపిస్తున్నారు.




