
అధిక బరువు సమస్య కొందమందిని వేధిస్తే, ముందుకు పొడుచుకు వచ్చిన బాన పొట్ట మరికొంతమందిని బాధిస్తుంది. కానీ మన ఇంట్లోనే, మన పోపుల పెట్టెలోనే సులువుగా లభించే దినుసులతో బెల్లి ఫ్యాట్‌ను కరిగించుకోవచ్చు. అదెలాగో ఇవాల్టి ‘టిప్ ఆఫ్ ది డే’ లో భాగంగా తెలుసుకుందాం.
బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునేందుకు సోంపు, జీలకర్ర, ధనియాలతో చేసిన కషాయం బాగా పనిచేస్తుందని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కషాయం త్రాగడం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది, శరీరంలో మంటను తగ్గిస్తుంది.
ఎలా తయారుచేసుకోవాలి
రెండు స్పూన్ల ధనియాలు, రెండు స్పూన్ల సోంపు, రెండు స్పూన్ల జీలకర్ర
4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇందులో జీలకర్ర, సోంపు, ధనియాలు వేసి 10-15 నిమిషాలు ఉడికించాలి. బాగా మరిగిన తరువాత ఈ కషాయాన్ని వడపోసుకోవాలి.
ఉదయాన్నే పరగడుపున (empty stomach)న తాగాలి. కనీసం మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఎంత వేలాడే పొట్ట అయినా సరే ఫ్లాట్‌గా మారిపోతుంది.
మరిన్నిలాభాలు
జీర్ణక్రియకు మంచిది, తద్వారా బరువు తగ్గుతుంది.
గట్ హెల్త్ మెరుగుపడుతుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీని వలన అనేక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం అనేక సమస్యలకు మూలం. శరీరంలో మంటను తగ్గిస్తుంది.
సోంపు, జీలకర్ర, ధనియాలలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చర్మం ప్రకాశం వంతంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు మటుమాయవుతాయి.
ఇది మర్చిపోవద్దు : అయితే ఈ కషాయం తాగుతున్నాం కదా అని ఆహార నియమాల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ చిట్కాను పాటిస్తూనే, కొద్ది సేపు నడక, కొవ్వు పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. తగినన్ని నీళ్లు సేవించాలి. రాత్రి భోజనం తొందరగా ముగించాలి. ప్రతీ భోజనం తరువాత కనీసం పది నిమిషాలు నడిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించడం ఖాయం.
నోట్: ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఈ నీటిని త్రాగే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్